శాఖవీధి ప్రభుత్వ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ముఖ్యమైన పాయింట్స్:గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్‌కు ఘన నివాళి.. పుస్తక ప్రదర్శన ప్రారంభం అనకాపల్లి, నవంబర్ 15 (ప్రజా ముద్ర): అనకాపల్లి పట్టణంలోని శాఖవీధి ప్రభుత్వ గ్రేడ్-1 శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఈ ప్రభుత్వ...