కార్మికులకు రక్షణ ఏది? పరిశ్రమల యజమానులకేనా ప్రభుత్వ భరోసా?
ముఖ్యమైన పాయింట్స్:డిసెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: సీఐటీయూ పిలుపు అనకాపల్లి, నవంబర్ 15 (ప్రజాముద్ర): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల యజమానులకు ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు విమర్శించారు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడపత్రికను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 12 ఏళ్లలో కార్మికుల...