ధరల భారంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు: మాజీ మంత్రి ధర్మాన
శ్రీకాకుళం: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. 2050 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని, రూపాయికే భూములు ఇస్తూ పరిశ్రమలు తెస్తామని సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ధర్మాన ఆరోపించారు. నేడు రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు తమ సంపాదనతో కుటుంబ సభ్యుల కడుపు నింపలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరల పెరుగుదల (2024 vs ప్రస్తుతం): బియ్యం (సూపర్ ఫైన్): రూ. 50 నుండి రూ. 85కి; సాధారణ బియ్యం: రూ....