బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన!

ముఖ్యమైన పాయింట్స్:ఉత్తరాంధ్రకు గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలుసాయంత్రానికి తుపానుగా.. రేపు తీవ్ర తుపానుగా బలపడే అవకాశంప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక అమరావతి, నవంబర్ 16 (ప్రజాముద్ర): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం అండమాన్ దీవులకు 640 కిలోమీటర్లు, చెన్నైకు 760...