మొబైల్ టెక్నీషియన్లకు భరోసా.. డిజిటల్ సేవలకు ‘ఎంఎస్ఎం’ యాప్
ముఖ్యమైన పాయింట్స్:మొబైల్ రిపేరింగ్ రంగంలో పారదర్శకత, భద్రతే లక్ష్యం రాజమహేంద్రవరం, ప్రజాముద్ర: మొబైల్ రిపేరింగ్ రంగంలో పనిచేస్తున్న టెక్నీషియన్ల భద్రతను బలోపేతం చేయడంతో పాటు, కస్టమర్లకు మరింత నమ్మకమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ కొత్తగా ఎంఎస్ఎం డిజిటల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ వ్యాపార కార్యకలాపాలను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని మెగా కన్వెన్షన్ హాల్లో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. యాప్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి, దాని పనితీరు, వినియోగం, ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా...