పోలీసులను కారుతో ఢీకొట్టిన బీజేపీ అభ్యర్థిని తక్షణమే అరెస్టు చేయాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య
ముఖ్యమైన పాయింట్స్:ఎన్నికలలో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్శ్రీకాకుళం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ విజయవాడ, నవంబర్ 16: నామినేషన్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులను కారుతో ఢీకొట్టిన శ్రీకాకుళం 36వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా వెంకటేశ్వరరావును తక్షణమే అరెస్టు చేసి, ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు (శ్రీకాకుళం మేయర్ అభ్యర్థి చల్లా గ్రీష్మ తండ్రి)...