అక్వాన్ తుఫానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి

ముఖ్యమైన పాయింట్స్:120–130 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశంనవంబర్ 19, 20 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలుఅధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలు అనకాపల్లి, నవంబర్ 17 (ప్రజా ముద్ర): బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను ముప్పు నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తుఫాను ప్రభావంతో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో,...