రహదారి ప్రమాదాల నివారణపై పోలీసుల ప్రత్యేక దృష్టి.. బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా బోర్డుల ఏర్పాటు

అనకాపల్లి: జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి, వాహనదారుల ప్రాణాలకు భద్రత కల్పించే దిశగా పోలీస్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి డీఎస్పీ, ట్రాఫిక్ పీఎస్ ఇన్స్పెక్టర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులతో కలిసి పట్టణ పరిధిలోని పలు సమస్యాత్మక కూడళ్లను సందర్శించారు. ​అధికారుల బృందం ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే కొత్తూరు జంక్షన్, నూకాలమ్మ ఆర్చ్ జంక్షన్, ఉమ్మలాడ జంక్షన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు స్పీడ్ లిమిట్ బోర్డులు, ప్రమాద హెచ్చరిక (హజార్డ్ వార్నింగ్) బోర్డులను ఏర్పాటు...