మోటార్ సైకిల్ చోరీ కేసులో నిందితుడికి 8 నెలల జైలు శిక్ష
ముఖ్యమైన పాయింట్స్:రూ.500 జరిమానా విధించిన న్యాయస్థానం.. జరిమానా చెల్లించకుంటే మరో 7 రోజుల జైలు శిక్ష అనకాపల్లి, నవంబర్ 18 (ప్రజాముద్ర): మోటార్ సైకిల్ చోరీ కేసులో నిందితుడికి న్యాయస్థానం 8 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ.500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 7 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. ఆలయం ఎదుట పార్క్ చేసిన బైక్ చోరీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్ 9న మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య అనకాపల్లి పట్టణంలోని లక్ష్మీదేవిపేట, పాతృడు కాలనీలో ఉన్న సంపత్ వినాయక ఆలయం ఎదుట...