అనకాపల్లిలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్

అనకాపల్లి, నవంబర్ 18 (ప్రజాముద్ర): క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అనకాపల్లిలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, జార్జ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్స్ సత్య విష్ణూస్ ట్రోఫీ పేరుతో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 21వ తేదీ శనివారం నుంచి 22వ తేదీ ఆదివారం వరకు రెండు రోజుల పాటు అనకాపల్లిలోని జార్జ్ క్లబ్ ఇండోర్ కోర్టులో పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు నగదు బహుమతులు టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయనున్నారు. మొదటి బహుమతిగా రూ.12,000, రెండో బహుమతిగా రూ.8,000, మూడో బహుమతిగా రూ.6,000 అందించనున్నారు....