అక్వాన్ తుపానుతో ఉత్తరాంధ్రకు ముప్పు
ముఖ్యమైన పాయింట్స్:శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశంగంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన ప్రజాముద్ర, విశాఖపట్నం, నవంబర్ 18: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాను గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం తుపాను నరసాపురానికి 500 కిలోమీటర్లు, కళింగపట్నానికి 540 కిలోమీటర్లు, చెన్నైకి 560 కిలోమీటర్లు,...