అనకాపల్లి జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు

ముఖ్యమైన పాయింట్స్:642 గ్రామ పంచాయతీలు.. 6,258 వార్డులకు ఎన్నికలు12.28 లక్షల మంది ఓటర్లు.. 6,335 పోలింగ్ కేంద్రాల ఏర్పాటునవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ అనకాపల్లి, నవంబర్ 19 (ప్రజాముద్ర): అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాలోని 24 మండలాల పరిధిలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 642 గ్రామ పంచాయతీలు, 6,258 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 6,335 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 12,28,253 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు....