ఎన్నికల వేళ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

ముఖ్యమైన పాయింట్స్:రేబాక, శంకరం గ్రామాల్లో అనకాపల్లి రూరల్ పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం అనకాపల్లి, నవంబర్ 19: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అనకాపల్లి రూరల్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అనకాపల్లి మండలంలోని రేబాక, శంకరం గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న 144 సెక్షన్ (ప్రస్తుత చట్ట ప్రకారం 163 బీఎన్ఎస్ఎస్), 30...