ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

అనకాపల్లి: ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిసెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను తగరంపూడిలో ఆశా కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా గత 12 ఏళ్లుగా ఆశా కార్యకర్తలు సేవలందిస్తున్నప్పటికీ, వారి వేతనాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ఆశా కార్యకర్తలకు నెలకు కనీసం రూ.42 వేల వేతనం...