అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణి,వైస్ చైర్‌పర్సన్‌గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక

అనకాపల్లి, నవంబర్ 20: అనకాపల్లి జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి, వైస్ చైర్‌పర్సన్‌గా మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించారు. ముందుగా జిల్లాలోని 24 మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీటీసీ సభ్యులతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. మోటూరు నాగమణి పేరును నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ ప్రతిపాదించగా, కశింకోట జడ్పీటీసీ సభ్యురాలు పొన్నగంటి నాగమణి బలపరిచారు. మిగిలిన సభ్యులంతా ఆమోదం తెలపడంతో ఆమె...