ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి మోసం.. నిందితుడికి ఏడాది జైలు

ముఖ్యమైన పాయింట్స్:రూ.20 వేల జరిమానా విధించిన విశాఖ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంవిచారణాధికారిగా ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి, నవంబర్ 20: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన ఈ కేసులో విశాఖపట్నంలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం (XI అదనపు జిల్లా జడ్జి కోర్టు) ఈ తీర్పు వెలువరించింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన గనిశెట్టి త్రినాథ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. యలమంచిలి మండలంలోని...