సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ముఖ్యమైన పాయింట్స్:ధర్మాచరణ, ఆధ్యాత్మిక చింతనతోనే సమాజానికి శాంతి, శ్రేయస్సుకార్తీక మాస సత్సంగంలో కృష్ణచరణానందభారతీ స్వామివారి హితబోధ విశాఖపట్నం, నవంబర్ 20:సనాతన ధర్మం భారతీయ సంస్కృతికి మూలస్తంభమని, దాని పరిరక్షణ, ఆచరణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ యాజ్ఞవల్క్యరాజాశ్రమ పీఠాధిపతులు, అభినవ వివేకానంద పూజ్యశ్రీ శ్రీశ్రీ డాక్టర్ కృష్ణచరణానందభారతీ స్వామివారు ఉద్బోధించారు. ధర్మాన్ని కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం చేయకుండా, నిత్యజీవితంలో సత్యం, ధర్మం, దయ, కరుణ, సేవాభావం, పరస్పర గౌరవం వంటి విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక చింతనతో కూడిన జీవన విధానమే వ్యక్తికి మానసిక ప్రశాంతతను, సమాజానికి శాంతి సౌభాగ్యాలను అందిస్తుందని ఆశీర్వచనం చేశారు. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ...