నూకాంబిక ఆలయ భూమి కొనుగోలులో తొమ్మిదేళ్ల జాప్యం!

ముఖ్యమైన పాయింట్స్:అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలి.. డాక్టర్ బి.ఎం. నాయుడు విజ్ఞప్తి అనకాపల్లి: అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి సమీపంలోని తన కుటుంబ వారసత్వ భూమి కొనుగోలు ప్రక్రియ తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ బి.ఎం. నాయుడు దేవాదాయ శాఖ అధికారులను కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. డాక్టర్ బి.ఎం. నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి ఓల్డ్ ఫోర్ట్ వార్డు పరిధిలోని నూకాంబిక ఆలయం సమీపంలో సర్వే నంబర్ 559/7లో తమ కుటుంబానికి వారసత్వంగా 48 సెంట్ల భూమి ఉందని...