ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్.ఎల్. చందాపురి 103వ జయంతి వేడుకలు
ముఖ్యమైన పాయింట్స్:జాతీయ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలియూజీసీ ఈక్వాలిటీ నిబంధనలు తక్షణమే అమలు చేయాలిబీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం తెలంగాణ అధ్యక్షుడు నగేష్ సూర్యవంశం డిమాండ్ హైదరాబాద్: భారత ఓబీసీ ఉద్యమ పితామహుడు, బహుజన హక్కుల పోరాట యోధుడు మాన్యవర్ త్యాగమూర్తి ఆర్.ఎల్. చందాపురి సాహెబ్ 103వ జయంతి వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ సూర్యవంశం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొని చందాపురి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీసీ...