నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు
నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.54.08 లక్షలు 77 రోజుల కానుకల లెక్కింపులో 20.05 గ్రాముల బంగారం, 1.060 కిలోల వెండి లభ్యం అమ్మవారిపై భక్తుల అచంచల విశ్వాసానికి హుండీ కానుకలే నిదర్శనం – ఈఓ, చైర్మన్ అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, భక్తుల ఆరాధ్య దైవంగా కొలువుదీరిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.54,08,952 ఆదాయం సమకూరింది. 77 రోజుల వ్యవధిలో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించింది. శుక్రవారం దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, సంబంధిత పర్యవేక్షకుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించారు....