మత్స్యరంగంలో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్లో జిల్లా మత్స్యశాఖ అధికారి వర్ధన్ ఐస్బాక్స్లతో కూడిన ద్విచక్ర వాహనాల పంపిణీ అనకాపల్లి, నవంబర్ 21: ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి ఎల్.బి.ఎస్. వర్ధన్, సహాయ సంచాలకులు జి. విజయ, జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు గురునాదరావు, SARDS స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మంగమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ‘మార్పు కోసం ప్రజలకు సాధికారత – మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో ముఖ్యంగా యువత, మహిళలకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాల కల్పన’ అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా...