తప్పుడు నంబర్ ప్లేట్లపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై చర్యలు.. ఉల్లంఘనులకు జరిమానాలు అనకాపల్లి, నవంబర్ 21: వాహనాలకు తప్పుడు, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకుని తిరిగే వారిపై అనకాపల్లి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు నకిలీ నంబర్ ప్లేట్లను వినియోగించకుండా అడ్డుకోవడంతో పాటు, వాహనాల గుర్తింపునకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. అనకాపల్లి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విరిగిపోయిన, స్పష్టంగా కనిపించని, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన నంబర్ ప్లేట్లను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా హిట్ అండ్ రన్...