రుషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతైన బీకాం విద్యార్థి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన బుల్లయ్య కాలేజీకి చెందిన బీకాం విద్యార్థుల్లో ఒకరు గల్లంతయ్యారు. విద్యార్థి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం బుల్లయ్య కాలేజీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రుషికొండ బీచ్‌కు వెళ్లినట్లు సమాచారం. వారిలో నలుగురు సముద్రంలో స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు ఒక విద్యార్థి సముద్రంలో గల్లంతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు శనివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు ప్రారంభించారు. టూరిజం బోట్ల సహాయంతో రాత్రంతా అన్వేషణ కొనసాగించారు. ఆదివారం ఉదయం నుంచి షిప్ ద్వారా సముద్రంలో గాలింపు చేపట్టారు. విద్యార్థి ఆచూకీ కోసం రెండు హెలికాప్టర్లను సైతం రంగంలోకి...