పొగ, ఆక్రమణల నుంచి విముక్తి కల్పించండి

చవితిన వీధి సమస్యలపై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ అధికారులకు స్థానికుల ఫిర్యాదు అనకాపల్లి, నవంబర్ 22: చవితిన వీధి ప్రధాన రహదారిపై పెరుగుతున్న అక్రమ ఆక్రమణలు, అనధికార వంట కేంద్రాల నుంచి వెలువడుతున్న పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని పొగ కాలుష్యం, రహదారి ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని 110వ వార్డు చవితిన వీధి ప్రధాన మార్గం సుమారు 40 అడుగుల వెడల్పు కలిగి ఉందని, అయితే రహదారిలో అధిక భాగాన్ని ఆక్రమిస్తూ అనేక అనధికార నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదులో...