ఇంటి తాళం తెరిచి బంగారం, నగదు చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్
ముఖ్యమైన పాయింట్స్:21.70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,500 నగదు స్వాధీనం విశాఖపట్నం, ప్రజాముద్ర ప్రతినిధి: ఇంటి తాళం తెరిచి బంగారు ఆభరణాలు, నగదు అపహరించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును గాజువాక క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 21.70 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం సిటీ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వెంకటరావు ఆధ్వర్యంలో సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో తాళం...