ష్రేష్ఠ (NETS) ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తులకు నవంబర్ 30 చివరి తేదీ.. జనవరి 10న ప్రవేశ పరీక్ష అనకాపల్లి: 2027–28 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ష్రేష్ఠ (SHRESHTA) పథకం ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పథకం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) SHRESHTA (NETS) ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులకు నవంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించగా, ప్రవేశ పరీక్షను 2027 జనవరి 10న నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లాలోని...