ఫేజ్-1 పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు
ముఖ్యమైన పాయింట్స్:శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి: ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి, నవంబర్ 23: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ముందస్తు భద్రతా చర్యలపై సమీక్షించారు. జిల్లాలో ఫేజ్-1 ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లోని 353 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకత ఆధారంగా గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిలో 71 అతి సమస్యాత్మక, 108 సమస్యాత్మక, 174 సాధారణ పోలింగ్ కేంద్రాలు...