పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
అనకాపల్లి, నవంబర్ 24: ఏళ్ల తరబడి న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న రాజీపడదగ్గ కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబర్ 12, 2026న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, భూవివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకింగ్, మనీ రికవరీ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే మోటార్ ప్రమాదాల నష్టపరిహార కేసులు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, కుటుంబ...