రైతులకు పంటల బీమాపై భరోసా.. రబీ 2026-27 బీమా పోర్టల్ ప్రారంభం
పంట నష్టాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యం – కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి, నవంబర్ 24: ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. రబీ 2024-25, ఖరీఫ్ 2025 పంటల బీమాకు సంబంధించి అర్హులైన రైతుల జాబితాను జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమోదించారు. అలాగే రబీ 2026-27 సీజన్‌కు సంబంధించిన పంటల బీమా పోర్టల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానులు, కరువు, అకాల వర్షాలు తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడులు కోల్పోయిన...