విద్యుత్ బిల్లుల పేరుతో వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఫేక్ ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దు వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి. ప్రసాద్ సూచన అనకాపల్లి, నవంబర్ 25: విద్యుత్ బిల్లుల చెల్లింపుల పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న నకిలీ ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాల పట్ల విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ అనకాపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. ప్రసాద్ సూచించారు. విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే బిల్లు చెల్లించకపోతే అదే రోజు రాత్రి 8 గంటల తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తూ గుర్తుతెలియని మొబైల్ నంబర్ల నుంచి కొంతమంది వినియోగదారులకు నకిలీ సందేశాలు వస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ బిల్లు చెల్లింపులు అప్డేట్ చేయాలని,...