
అనకాపల్లి అక్టోబర్ 17: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల రెండవ రోజు ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో చైర్పర్సన్ గా భారతీయ జనతా పార్టీ నుండి 3 నామినేషన్లు, వైయస్సార్సీపి పార్టీ నుండి 3 నామినేషన్లు కలిపి మొత్తం ఈరోజు 6 నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రెండు రోజులు కలిపి మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి.
అదేవిధంగా ఎలమంచిలి వార్డ్ మెంబర్లుగా తెలుగుదేశం పార్టీ నుండి 10 నామినేషన్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నుండి 30 నామినేషన్లు కలిపి మొత్తం 40 నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజులకు కలపి మొత్తం 41 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో వార్డ్ మెంబర్లుగా తెలుగుదేశం పార్టీ నుండి 47 , వైఎస్ఆర్సిపి పార్టీ నుండి 35, జనసేన పార్టీ నుండి 7, భారతీయ జనతా పార్టీ నుండి 2, సిపిఎం పార్టీ నుండి 1, ఇండిపెండెంట్ లుగా 2 మొత్తం ఈరోజు 84 నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజులకు కలిపి వార్డ్ మెంబర్లుగా మొత్తం 94 నామినేషన్లు దాఖలయ్యాయి.
నర్సీపట్నం చైర్ పర్సన్ గా ఈరోజు జనసేన పార్టీ నుండి 1, బీఎస్పీ పార్టీ నుండి 1 మొత్తం 2 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రెండు రోజులకు మొత్తం 6 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

