ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్
అనకాపల్లి, అక్టోబర్ 21:ఎన్నికల నిర్వహణలో అధికారులు అత్యంత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, జిల్లా స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గత ఘటనలు, కేసుల వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎస్హెచ్ఓలు, తహసీల్దార్ల నుంచి సేకరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్గ, మండల పటాల ఆధారంగా సున్నిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల ఓటర్లను ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసినా, ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం లేదా బెదిరించడం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 171 ప్రకారం తీవ్ర నేరమని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు పూర్ణిమ దేవి పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలను వాటి తీవ్రత ఆధారంగా విభజించి, ఆ వివరాలను నిర్దేశిత ప్రొఫార్మా-1 ద్వారా ముందస్తుగా సమర్పించాలని నిర్దేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎస్ఈసీఎంఎస్ మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు. ఓటర్లు రాని ప్రాంతాలపై ప్రత్యేక నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.