PRAJA MUDRA
నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి విజయం 11,519 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందజేత అనకాపల్లి, నవంబర్ 3 (ప్రజాముద్ర): నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల పద్మావతి విజయం సాధించారు. మొత్తం 35,765 ఓట్లు పోలవగా, పద్మావతికి 23,028 ఓట్లు లభించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకాయల అనితకు 11,573 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి బైపురెడ్డి చిట్టి శివ సంధ్యారాణికి 191 ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు 573 ఓట్లు చెల్లనివిగా నమోదవగా, 400 ఓట్లు నోటాకు పడ్డాయి. దీంతో చింతకాయల...
తీరం దాటిన తీవ్ర తుపాను ‘మురసు’ ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున ల్యాండ్‌ఫాల్.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మురసు’ మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. నెల్లూరు–నరసాపురం మధ్య ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తుపాను తీరం దాటినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సంయుక్తంగా వెల్లడించాయి. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు...
విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సాయం బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్ బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో దాడికి గురై బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో వైద్యులను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పాఠశాలలోకి ఎలక్ట్రికల్ రంపంతో ఓ వ్యక్తి ప్రవేశించి విద్యార్థినులపై...
రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానవీయ దాడి వంటి ఘటనలు సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలకు వ్యక్తిగత బాధ్యతతో పాటు సమాజంలో తగ్గిపోతున్న మానవతా విలువలు కూడా ఒక కారణమని భావించాల్సి ఉంది. పిల్లల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, ఇతరుల పట్ల గౌరవం పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. పిల్లలపై ప్రేమ చూపించడం ఎంత ముఖ్యమో, అతిగా గారాబం చేయకుండా తప్పొప్పులను వివరించడం కూడా అంతే ముఖ్యం. పిల్లల్లో వస్తున్న శారీరక, మానసిక మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. వారి భావాలను అర్థం చేసుకుని, అవసరమైనప్పుడు సరైన మార్గదర్శకత్వం అందించాలి. గెలుపుతో పాటు ఓటమిని...
అనకాపల్లి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి, నవంబర్ 1: అనకాపల్లి జిల్లా పరిధిలోని నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీలతో పాటు జీవీఎంసీ వార్డుల ఎన్నికల పోలింగ్ ఆదివారం అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, జిల్లాలో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైన...
ముంబై: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, వ్యాపార రంగంలో లేదా కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించడానికి పెద్ద ఆలోచనలతో పాటు నిరంతర శ్రమ ఎంతో అవసరమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న మూడు ప్రాథమిక విజయ సూత్రాలను ఆయన యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. 1. లక్ష్యంపైనే దృష్టి – అడ్డంకులు దాటే మార్గం "మొదటగా పెద్ద కలలు కనండి. మీ ఆలోచన ఎల్లప్పుడూ తుది లక్ష్యంపైనే స్థిరంగా ఉండాలి" అని అంబానీ పేర్కొన్నారు. ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు, సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని మరువకుండా ముందడుగు...
కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ సంక్షేమం, అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి 107, 110 వార్డుల సమావేశాల్లో ఎమ్మెల్యే కొణతాల, మాజీ ఎమ్మెల్యే పీలా అనకాపల్లి, ప్రజాముద్ర ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి పరిధిలోని 107వ వార్డు సిరసపల్లి, 110వ...
కూటమిని గెలిపిస్తేనే వార్డు సమగ్ర అభివృద్ధి: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ 109వ వార్డులో బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌తో కలిసి ఇంటింటి ప్రచారం అనకాపల్లి (ప్రజా ముద్ర ప్రతినిధి): జీవీఎంసీ పరిధిలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారం, వార్డుల సమగ్ర అభివృద్ధి కూటమి కూటమి అభ్యర్థుల విజయంతోనే సాధ్యమని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆయన 109వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు పరిధిలోని విజయరామరాజుపేట వీధులు, పరిసర ప్రాంతాల్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌తో కలిసి...
కసింకోట మండలంలో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం తేగడ, కొత్తపల్లి, విస్సన్నపేట గ్రామాల్లో అభ్యర్థుల తరఫున పొన్నగంటి అప్పారావు విస్తృత పర్యటన దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తున్నాం: అప్పారావు కసింకోట:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ సమగ్ర ప్రగతికి బాటలు వేస్తోందని కూటమి ముఖ్య నాయకులు పొన్నగంటి అప్పారావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా...
జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించిన సబ్బవరపు గణేష్ అనకాపల్లి:(ప్రజాముద్ర)జీవీఎంసీ 111వ వార్డు పరిధిలోని భీముని గుమ్మం వీధిలో కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై ఓటు ఏ విధంగా వేయాలో వృద్ధులకు, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులకు నమూనా పత్రాల...
110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారం ఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధిలో ఇంటింటి పర్యటన (అనకాపల్లి): జీవీఎంసీ 110వ వార్డు పరిధిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉగ్గిన జ్యోత్స్న పద్మజ విజయానికి మద్దతుగా ఆమె భర్త, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉగ్గిన అప్పారావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం వార్డు పరిధిలోని ఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధి తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో...
అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి కొత్తూరు గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, కరపత్రాల పంపిణీ అనకాపల్లి:(ప్రజాముద్ర) మండల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి జడ్పీటీసీగా తనకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బలపరిచిన అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు ప్రజలను కోరారు. మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామీణ ప్రాంతాలు...
కూటమి అభ్యర్థులను ఓడించండి.. సీపీఎం, వామపక్షాల అభ్యర్థులను గెలిపించండి కార్మికులు, ప్రజలకు సీఐటీయూ జిల్లా నాయకత్వం పిలుపు అభ్యర్థుల వివరాలతో కూడిన పోస్టర్ ఆవిష్కరణ అనకాపల్లి:)ప్రజాముద్ర)ఈనెల 5వ తేదీన జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీపీఎం, వామపక్షాల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి. శ్రీనివాసరావు, రుత్తల శంకర్రావు కార్మికులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు కె.ఈశ్వరరావులతో కలిసి అభ్యర్థుల జాబితా, ఫొటోలతో కూడిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.....
అనకాపల్లిలో ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి • రోడ్లమీదకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు • జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిద్ధార్థ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన . అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి): అనకాపల్లి జీవీఎంసీలో విలీనమై, నూతన జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న జిల్లా, పట్టణ ప్రజలకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సిద్ధార్థ సోషల్ సర్వీస్ &...
కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ జీవీఎంసీ 110, 111 వార్డుల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం అనకాపల్లి (ప్రజాముద్ర): జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ పిలుపునిచ్చారు. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, కూటమి రథసారథి భీమరశెట్టి రామ్కి ఆదేశాల మేరకు...
అనకాపల్లి జిల్లాలో 'ఆర్నాబ్' తుఫాను సహాయక చర్యలు: రూ. 2.05 కోట్లకు పైగా ముందస్తు నిధులు విడుదల చేసిన కలెక్టర్ విజయ కృష్ణన్ తుఫాను ముందస్తు ఏర్పాట్లు, సహాయక చర్యల కోసం నిధుల కేటాయింపు రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య తదితర శాఖలకు నిధుల బదిలీ అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని కలెక్టర్ ఆదేశం ప్రజాముద్ర, అనకాపల్లి: జిల్లాలో దూసుకొస్తున్న "ఆర్నాబ్" తుఫాను ప్రభావం నేపథ్యంలో, ముందస్తు రక్షణ మరియు సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- (రెండు కోట్ల ఐదు లక్షల యాభై వేల రూపాయలు) ముందస్తు నిధులను విడుదల చేసినట్లు...
అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల సమరం: బరిలో 80 మంది జడ్పీటీసీ, 979 మంది ఎంపీటీసీ అభ్యర్థులు పోలింగ్ నవంబర్ 5న, కౌంటింగ్ 7న రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజాముద్ర, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5వ తేదీన ఉదయం 7:00 గంటల...
అనకాపల్లిలో ఎన్నికల వేడి: అత్యధిక మెజారిటీ సాధించిన వార్డుకు రూ.2 కోట్ల బోనస్ – ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సంచలన హామీ అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి): అనకాపల్లి జీవీఎంసీ (GVMC) పరిధిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి అభ్యర్థుల విజయాన్ని సులభతరం చేయడంతో పాటు, వారిలో గెలుపు ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వార్డుకు ప్రభుత్వం కేటాయించే సాధారణ నిధులకు అదనంగా రూ. 2 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ...
అనకాపల్లిపై అర్నబ్ తుఫాను పంజా: రంగంలోకి యంత్రాంగం జిల్లావ్యాప్తంగా కూలిన 74 చెట్లు.. 42 విద్యుత్ స్తంభాలు ధ్వంసం ముమ్మరంగా సహాయక చర్యలు.. ప్రాణ, పశు నష్టం లేకపోవడంతో ఊరట అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి): అర్నబ్ తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తుఫాను తీవ్రతకు పలు మండలాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అధికార యంత్రాంగం బుధవారం ఉదయం 5 గంటల వరకు విడుదల చేసిన నష్టాల నివేదిక ప్రకారం, జిల్లాలో భారీ వర్షపాతం నమోదైనప్పటికీ ప్రాణ, పశు నష్టం తప్పడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు....
అండర్ బ్రిడ్జ్ కింద నీరు నిలవకుండా చూడండి: అధికారులకు కలెక్టర్ ఆదేశం తుపాను వేళ అప్రమత్తం: అనకాపల్లిలో ఫ్లైఓవర్, రైల్వే పనులను తనిఖీ చేసిన కలెక్టర్, జేసీ రహదారులు, డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు తుపాను ప్రభావంతో రాకపోకలకు ఆటంకం కలగొద్దు: ప్రత్యామ్నాయ రహదారులపై కలెక్టర్ దిశానిర్దేశం అనకాపల్లి (అక్టోబర్ 28, బుధవారం): 'అర్నబ్' తుపాను హెచ్చరికల నేపథ్యంలో అనకాపల్లి పట్టణంలోని ఫ్లైఓవర్, రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) పనులను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్‌తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా...
స్తంభించిన రాకపోకలు.. వర్షంలోనూ రంగంలోకి దిగిన పోలీసులు, అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చెట్ల తొలగింపు.. ట్రాఫిక్ పునరుద్ధరణ అనకాపల్లి క్రైమ్ బ్యూరో: అర్ణబ్ తుపాను ప్రభావంతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర గాలుల ధాటికి మంగళవారం రాత్రి అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. డైట్ కాలేజీ వద్ద 20 నిమిషాల్లోనే...
ఆర్నాబ్’ తుపానుతో పోటెత్తుతున్న వరద నీరు.. దిగువకు భారీగా విడుదల 6 మండలాల పరిధిలోని గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ విజయకృష్ణన్ అనకాపల్లి:బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నాబ్’ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు...
అర్నాబ్ తుఫాను అక్టోబర్ 28న బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరప్రాంత జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మరియు విద్యుత్ శాఖ పర్యవేక్షక...
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ✔️ మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దు. ✔️ అతివేగం, ట్రిపుల్ రైడింగ్ ప్రాణాంతకం. ✔️ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి. ✔️ బస్సులు, ఆటోలు ఎక్కేటప్పుడు/దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అనకాపల్లి:(ప్రజాముద్ర ప్రతినిధి) రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూడిమడక జంక్షన్ వద్ద వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మరియు అనకాపల్లి ఎస్డీపీవోల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ శ్రీ కె. నాగేశ్వరరావు...
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సాప్ సందేశాలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా కలెక్టర్ పేరు, నకిలీ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాట్సాప్‌లో పలు తప్పుడు సందేశాలు, సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను పరిశీలించకుండా నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని స్పష్టం చేశారు....
మొత్తం వార్డులు: అనకాపల్లి జోన్ పరిధిలోని 6 వార్డులు (107, 108, 109, 110, 111, 112). పోటీలో ఉన్న అభ్యర్థులు: మొత్తం 19 మంది. ఉపసంహరించుకున్న నామినేషన్లు: మొత్తం 14 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు (107-109 వార్డుల్లో 6 మంది, 110-112 వార్డుల్లో 8 మంది). పోలింగ్ వివరాలు: 2026 అక్టోబర్ 28న ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు. అనకాపల్లి:గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని అనకాపల్లి జోన్‌కు చెందిన 107 నుండి 112 వార్డుల వార్డు మెంబర్ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ తుది...
నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పహారా 100 మీటర్ల పరిధిలోకి నలుగురికే ప్రవేశం బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన అనకాపల్లి, అక్టోబర్ 22 (ప్రజాముద్ర ప్రతినిధి): జిల్లాలో జరుగుతున్న ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకు చేరిన నేపథ్యంలో బుధవారం ఆయన బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట మండల పరిషత్ కార్యాలయాలు (MPDO), జిల్లా పరిషత్ కార్యాలయ పరిసరాల్లోని నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు....
108వ డివిజన్‌లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం పాల్గొన్న గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర అనకాపల్లి (ప్రజామద్ర ప్రతినిధి):అనకాపల్లి పట్టణం 108వ వార్డు పరిధిలో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. స్థానిక టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొణతాల సింధుజకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర కూటమి నాయకులతో కలిసి గురువారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మళ్ళా సురేంద్ర మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని...
అనకాపల్లి, అక్టోబర్ 21:ఎన్నికల నిర్వహణలో అధికారులు అత్యంత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, జిల్లా స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గత ఘటనలు, కేసుల వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎస్హెచ్ఓలు, తహసీల్దార్ల నుంచి సేకరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్గ, మండల...
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం– జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ,ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి, అక్టోబర్ 21:* పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల రక్షణ కోసం ముఖ పరిచయం లేని సాధారణ పౌరుల కోసం ప్రాణాలను...
సరుగుడు తోటలో విషాదం.. కాపరుల కన్నీరుమున్నీరు.. మృతిచెందిన జీవాలకు పరిహారం అందించాలని బాధితుల వేడుకోలు.. పాతపట్నం, సెప్టెంబర్ 28 సిక్కోలు గర్జన న్యూస్: వంశధార జలాశయం ఎగువ ప్రాంతంలోని సరుగుడు తోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు పిచికారీ చేసిన గడ్డి, సరుగుడు ఆకులను మేయడంతో సుమారు 20 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జీవాలు మృత్యువాత పడటంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు ఆదివారం తమ జీవాలను మేత...
*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం* *అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు* *ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.* adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6...