PRAJA MUDRA
రిపోర్టర్
మీ ప్రాంత వార్తల కోసం లొకేషన్ ఆన్ చేయండి
Breaking
⚡ BREAKING

కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ సందేశాలు: అప్రమత్తంగా ఉండాలన్న యంత్రాంగం

Breaking
⚡ BREAKING

పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..

Breaking
⚡ BREAKING

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

ఫ్లిప్ న్యూస్
ప్రపంచం (World)
క్రీడలు (Sports)
ఈ-పేపర్
లైవ్ టీవీ
రీల్స్ / షార్ట్స్
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

Crime వార్తలు

అన్ని వార్తలు ×
Thumb
📍 అనకాపల్లి

కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ సందేశాలు: అప్రమత్తంగా ఉండాలన్న యంత్రాంగం

10 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Crime

పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..

3 రోజుల క్రితం 1 పూర్తి వార్త »
Thumb
📍 Crime

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

17 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
10 రోజుల క్రితం
Logo

కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ సందేశాలు: అప్రమత్తంగా ఉండాలన్న యంత్రాంగం

​అనకాపల్లి: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సాప్ సందేశాలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ​గత రెండు రోజులుగా కలెక్టర్ పేరు, నకిలీ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాట్సాప్‌లో పలు తప్పుడు సందేశాలు, సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను పరిశీలించకుండా నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని స్పష్టం చేశారు....

​అనకాపల్లి: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సాప్ సందేశాలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ​గత రెండు రోజులుగా కలెక్టర్ పేరు, నకిలీ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాట్సాప్‌లో పలు తప్పుడు సందేశాలు, సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను పరిశీలించకుండా నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని స్పష్టం చేశారు. నకిలీ సందేశాలు సృష్టించే వారిపై, వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Crime News
Reporter
PRAJAMUDRA
3 రోజుల క్రితం
Logo

పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..

సరుగుడు తోటలో విషాదం.. కాపరుల కన్నీరుమున్నీరు.. మృతిచెందిన జీవాలకు పరిహారం అందించాలని బాధితుల వేడుకోలు.. పాతపట్నం, సెప్టెంబర్‌ 28 సిక్కోలు గర్జన న్యూస్: వంశధార జలాశయం ఎగువ ప్రాంతంలోని సరుగుడు తోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు పిచికారీ చేసిన గడ్డి, సరుగుడు ఆకులను మేయడంతో సుమారు 20 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జీవాలు మృత్యువాత పడటంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు ఆదివారం తమ జీవాలను మేత...

ముఖ్యమైన పాయింట్స్:

  • సరుగుడు తోటలో విషాదం.. కాపరుల కన్నీరుమున్నీరు..
  • మృతిచెందిన జీవాలకు పరిహారం అందించాలని బాధితుల వేడుకోలు..
పాతపట్నం, సెప్టెంబర్‌ 28 సిక్కోలు గర్జన న్యూస్: వంశధార జలాశయం ఎగువ ప్రాంతంలోని సరుగుడు తోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు పిచికారీ చేసిన గడ్డి, సరుగుడు ఆకులను మేయడంతో సుమారు 20 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జీవాలు మృత్యువాత పడటంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు ఆదివారం తమ జీవాలను మేత కోసం సమీప ప్రాంతాలకు తోలుకెళ్లారు. ఈ క్రమంలో వంశధార జలాశయం ఎగువన ఉన్న సరుగుడు తోటలోకి గొర్రెలు, మేకలు ప్రవేశించాయి. అక్కడ పిచ్చి మొక్కలు, గడ్డి నివారణ కోసం కొద్దిరోజుల క్రితం పురుగుల మందు పిచికారీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.ఈ విషయం తెలియని జీవాలు మందు పిచికారీ చేసిన గడ్డి, ఆకులను మేయడంతో కొద్దిసేపటికే అస్వస్థతకు గురైనట్లు కాపరులు తెలిపారు. అనంతరం సుమారు 35 జీవాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.ఎన్నో ఏళ్లుగా గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఈ ఘటన తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని బాధిత కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందే జీవాలు విలవిలలాడుతూ మృతి చెందడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న జీవాలను కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. మృతిచెందిన జీవాలకు అసలు కారణాలను పశువైద్య అధికారులు నిర్ధారించాలని, పురుగుల మందు పిచికారీ చేసిన ప్రాంతంలో జీవాలు మేయకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.జీవాలను కోల్పోయిన బాధిత కాపరులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

Crime News
Reporter
PRAJAMUDRA
17 రోజుల క్రితం
Logo

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం* *అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు* *ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.* adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6...

ముఖ్యమైన పాయింట్స్:

  • *సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం*
  • *అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు*
  • *ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.*
adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన తండ్రి వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి మొక్కలను సాగు చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. *అరెస్టైన నిందితుడు:* కోడప మారుతి S/o పగ్గు, వయస్సు 34 సంవత్సరాలు, వృత్తి: రైతు, నివాసం: పరస్వాడ-బి, గడిగూడ మండలం. గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ASP రిత్విక్ సాయి కొట్టే IPS తెలిపారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ దాడిలో నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి

ప్రధాన కేటగిరీలు (Categories)

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు (26)

తెలంగాణ జిల్లాలు (33)