PRAJA MUDRA
రిపోర్టర్
మీ ప్రాంత వార్తల కోసం లొకేషన్ ఆన్ చేయండి
Breaking
⚡ BREAKING

తీరం దాటిన తీవ్ర తుపాను ‘మురసు’

Breaking
⚡ BREAKING

కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ

Breaking
⚡ BREAKING

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Breaking
⚡ BREAKING

జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం

Breaking
⚡ BREAKING

110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారం

ఫ్లిప్ న్యూస్
ప్రపంచం (World)
క్రీడలు (Sports)
ఈ-పేపర్
లైవ్ టీవీ
రీల్స్ / షార్ట్స్
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్ని వార్తలు ×
Thumb
📍 గుంటూరు

తీరం దాటిన తీవ్ర తుపాను ‘మురసు’

20 గం. క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారం

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి

5 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

జిల్లాలో 'ఆర్నాబ్' తుఫాను సహాయక చర్యలు: రూ. 2.05 కోట్లకు పైగా ముందస్తు నిధులు విడుదల

5 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు

5 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అర్నబ్' తుపాను ముప్పు: రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అర్ణబ్ తుపాను బీభత్సం: జాతీయ రహదారిపై విరిగిపడిన భారీ వృక్షాలు!

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

పెద్దేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత.. లోతట్టు ప్రాంతాలకు తీవ్ర హెచ్చరికలు!

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అర్నాబ్ తుఫాన్ తీవ్ర హెచ్చరికలు: అనకాపల్లి జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు

8 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ- ట్రాఫిక్ సీఐ కె. నాగేశ్వరరావు

9 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ సందేశాలు: అప్రమత్తంగా ఉండాలన్న యంత్రాంగం

10 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

అనకాపల్లి జీవీఎంసీ వార్డుల్లో ఎన్నికల సందడి: తేలిన అభ్యర్థుల తుది జాబితా.. బరిలో 19 మంది!

11 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా

12 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి

12 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్

13 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 అనకాపల్లి

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలు – జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా

13 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
📍 గుంటూరు • Amaravathi News
Reporter
PRAJAMUDRA
20 గం. క్రితం
Logo

తీరం దాటిన తీవ్ర తుపాను ‘మురసు’

తీరం దాటిన తీవ్ర తుపాను ‘మురసు’ ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున ల్యాండ్‌ఫాల్‌.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మురసు’ మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. నెల్లూరు–నరసాపురం మధ్య ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తుపాను తీరం దాటినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సంయుక్తంగా వెల్లడించాయి. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు...

ముఖ్యమైన పాయింట్స్:

  • తీరం దాటిన తీవ్ర తుపాను ‘మురసు’
  • ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున ల్యాండ్‌ఫాల్‌.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మురసు’ మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. నెల్లూరు–నరసాపురం మధ్య ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తుపాను తీరం దాటినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సంయుక్తంగా వెల్లడించాయి. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ

కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ ​సంక్షేమం, అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం ​స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి ​107, 110 వార్డుల సమావేశాల్లో ఎమ్మెల్యే కొణతాల, మాజీ ఎమ్మెల్యే పీలా అనకాపల్లి, ప్రజాముద్ర ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి పరిధిలోని 107వ వార్డు సిరసపల్లి, 110వ...

ముఖ్యమైన పాయింట్స్:

  • కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ
  • ​సంక్షేమం, అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం
  • ​స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి
  • ​107, 110 వార్డుల సమావేశాల్లో ఎమ్మెల్యే కొణతాల, మాజీ ఎమ్మెల్యే పీలా
అనకాపల్లి, ప్రజాముద్ర ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి పరిధిలోని 107వ వార్డు సిరసపల్లి, 110వ వార్డు రోటరీ క్లబ్ వద్ద నిర్వహించిన అవగాహన సదస్సుల్లో స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ‘సూపర్ సిక్స్’ పథకాలతో పాటు నిరుద్యోగుల చిరకాల స్వప్నమైన మెగా డీఎస్సీని పట్టాలెక్కించి చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరంతర అభివృద్ధి, సంస్కరణలు సమర్థవంతంగా సాగాలంటే రాజకీయ స్థిరత్వం అత్యంత కీలకమని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ​అభివృద్ధికి ఎన్డీయే.. విధ్వంసానికి వైసీపీ: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర విధ్వంసానికి గురైందని, కూటమి పాలనలో సుపరిపాలన, పారదర్శకతతో పునర్నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల కలయికతో ‘ట్రిపుల్ ఇంజిన్’ తరహా పాలన సాగితేనే పథకాల లబ్ధి ప్రతి అర్హుడికీ వేగంగా చేరుతుందని చెప్పారు. అలాగే ప్రజాసేవ పట్ల అంకితభావం కలిగిన విద్యావంతులు, యువతకు రాబోయే రోజుల్లో కూటమిలోని మూడు పార్టీలు పెద్దపీట వేస్తాయని తెలిపారు. ​ఇటీవల ముంచుకొచ్చిన ‘అర్నబ్’ తుఫాను ముప్పును ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా రక్షించగలిగామని వివరించారు. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రతి గడపకూ చేరవేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

కసింకోట మండలంలో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం ​తేగడ, కొత్తపల్లి, విస్సన్నపేట గ్రామాల్లో అభ్యర్థుల తరఫున పొన్నగంటి అప్పారావు విస్తృత పర్యటన ​దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తున్నాం: అప్పారావు కసింకోట:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ సమగ్ర ప్రగతికి బాటలు వేస్తోందని కూటమి ముఖ్య నాయకులు పొన్నగంటి అప్పారావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా...

ముఖ్యమైన పాయింట్స్:

  • కసింకోట మండలంలో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం
  • ​తేగడ, కొత్తపల్లి, విస్సన్నపేట గ్రామాల్లో అభ్యర్థుల తరఫున పొన్నగంటి అప్పారావు విస్తృత పర్యటన
  • ​దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తున్నాం: అప్పారావు
కసింకోట:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ సమగ్ర ప్రగతికి బాటలు వేస్తోందని కూటమి ముఖ్య నాయకులు పొన్నగంటి అప్పారావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ​బుధవారం తేగడ, కొత్తపల్లి, జమాదులపాలెం, విస్సన్నపేట, రామన్నపాలెం గ్రామాల్లో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు కూటమి శ్రేణులకు ఘన స్వాగతం పలికారు. ​ఈ సందర్భంగా పొన్నగంటి అప్పారావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులు నేడు ప్రజల కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో అర్హులైన పేదలకు రికార్డు స్థాయిలో పింఛన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంయుక్త సారథ్యంలో పల్లెల్లో మునుపెన్నడూ లేని విధంగా నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర వికాసం కూటమి అభ్యర్థుల విజయంతోనే సాధ్యమని, ఓటర్లంతా భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని కోరారు. ​తరలివచ్చిన నాయకులు, శ్రేణులు: ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిని రమణమూర్తి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కాయల మురళీధర్, జనసేన పార్టీ నాయకులు కర్రి సత్యనారాయణ, ఉమ్మి సత్యనారాయణ, ఎంపీటీసీ అభ్యర్థులు గొర్ల దత్తాత్రేయ, కట్టోజు సాయిలక్ష్మి పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచులు సిద్దిరెడ్డి సూర్యనారాయణ, బుధిరెడ్డి గంగయ్య, తిర్రి చిరంజీవి, బద్ది గోవింద, మండల ఐ-టీడీపీ అధ్యక్షులు జెర్రీపోతుల నూకునాయుడు, మాజీ ఎంపీటీసీ షేక్ బాబర్, స్థానిక నాయకులు గొల్లవిల్లి ప్రవీణ్, సిదిరెడ్డి శ్రీను, మండే శ్రీను, బత్తిన రమణ, పప్పు ఈశ్వరరావుతో పాటు భారీ సంఖ్యలో కూటమి కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం

జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించిన సబ్బవరపు గణేష్ అనకాపల్లి:(ప్రజాముద్ర)జీవీఎంసీ 111వ వార్డు పరిధిలోని భీముని గుమ్మం వీధిలో కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ​రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై ఓటు ఏ విధంగా వేయాలో వృద్ధులకు, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులకు నమూనా పత్రాల...

ముఖ్యమైన పాయింట్స్:

  • జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం
  • ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించిన సబ్బవరపు గణేష్
అనకాపల్లి:(ప్రజాముద్ర)జీవీఎంసీ 111వ వార్డు పరిధిలోని భీముని గుమ్మం వీధిలో కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ​రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై ఓటు ఏ విధంగా వేయాలో వృద్ధులకు, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులకు నమూనా పత్రాల ద్వారా ఆయన వివరించారు. కూటమి బలపరిచిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పలక యశోదకు ‘కమలం’ గుర్తుపై, కూటమి టీడీపీ మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణికి ‘సైకిల్’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన స్థానికులను కోరారు. వార్డు అభివృద్ధి కూటమి అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు మాజీ అధ్యక్షుడు పోతల శ్రీను, బూత్ ఇంచార్జ్ సిమిటి రామకృష్ణ, నాయకులు దౌర్ల కిషోర్ కుమార్, శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం ధర్మకర్త ఎల్లబెల్లి కనకతో పాటు పలువురు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారం

110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారం ఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధిలో ఇంటింటి పర్యటన (అనకాపల్లి): జీవీఎంసీ 110వ వార్డు పరిధిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉగ్గిన జ్యోత్స్న పద్మజ విజయానికి మద్దతుగా ఆమె భర్త, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉగ్గిన అప్పారావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం వార్డు పరిధిలోని ఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధి తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో...

ముఖ్యమైన పాయింట్స్:

  • 110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారం
  • ఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధిలో ఇంటింటి పర్యటన
(అనకాపల్లి): జీవీఎంసీ 110వ వార్డు పరిధిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉగ్గిన జ్యోత్స్న పద్మజ విజయానికి మద్దతుగా ఆమె భర్త, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉగ్గిన అప్పారావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం వార్డు పరిధిలోని ఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధి తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉగ్గిన అప్పారావు మాట్లాడుతూ.. ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పంతోనే తన సతీమణి ఎన్నికల బరిలో నిలిచారని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జ్యోత్స్న గెలుపు వార్డు అభివృద్ధికి సరికొత్త మలుపు కానుందని పేర్కొన్నారు. తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. 110వ డివిజన్ వైకాపా ఎన్నికల ఇంచార్జ్ శ్రీధరాల మనోజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోన ఉమ, కోటపాడు శివ, ఈతలపాక శివ, జెట్టి శ్రీను, గుండా గుప్తా, కొడుకుల సుబ్రహ్మణ్యం, కోలా గణేష్, చింతా రాంజీ, సతీష్ రెడ్డి, డేనియల్, కోలా సూర్యనారాయణ, మొగలపల్లి సుబ్బారావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి

అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి ​బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి ​కొత్తూరు గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, కరపత్రాల పంపిణీ అనకాపల్లి:(ప్రజాముద్ర) మండల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి జడ్పీటీసీగా తనకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బలపరిచిన అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు ప్రజలను కోరారు. ​మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామీణ ప్రాంతాలు...

ముఖ్యమైన పాయింట్స్:

  • అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి
  • ​బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి
  • ​కొత్తూరు గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, కరపత్రాల పంపిణీ
అనకాపల్లి:(ప్రజాముద్ర) మండల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి జడ్పీటీసీగా తనకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బలపరిచిన అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు ప్రజలను కోరారు. ​మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఈ ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ​ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
4 రోజుల క్రితం
Logo

ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి

అనకాపల్లిలో ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి • రోడ్లమీదకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు • జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిద్ధార్థ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన . అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి): అనకాపల్లి జీవీఎంసీలో విలీనమై, నూతన జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న జిల్లా, పట్టణ ప్రజలకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సిద్ధార్థ సోషల్ సర్వీస్ &...

ముఖ్యమైన పాయింట్స్:

  • అనకాపల్లిలో ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి
  • • రోడ్లమీదకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు
  • • జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిద్ధార్థ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
  • .
అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి): అనకాపల్లి జీవీఎంసీలో విలీనమై, నూతన జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న జిల్లా, పట్టణ ప్రజలకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సిద్ధార్థ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు, సీనియర్ సిటిజన్లు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి తగ్గట్లుగా సరైన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ లేకపోవడం శోచనీయమన్నారు. రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారని, రోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం: పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురై వ్యాపారాలు సాగుతున్నాయని, భవనాల సెల్లార్లలో సైతం వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకుండా పోయిందన్నారు. అలాగే తోపుడు బండ్లు, చిరు దుకాణాల వారికి ప్రత్యేక స్థలాలు కేటాయించకుండా రోడ్లపైనే వ్యాపారాలు చేసుకునేలా వదిలేయడం, ఆర్‌టీవో అధికారుల నిర్లిప్తత, పట్టణంలో వన్‌వే వ్యవస్థను అమలు చేయకపోవడం వల్లే ట్రాఫిక్ సమస్య జటిలమైందని పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఈ సమస్యల పరిష్కారానికై సిద్ధార్థ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పోలీస్ యంత్రాంగం, జీవీఎంసీ, ఆర్‌టీవో అధికారులు తక్షణమే స్పందించి పటిష్టమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిద్ధార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సభ్యులు అయ్యగారు వెంకటరమణమూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ సంస్థ చైర్మన్ పిరాట్ల నరసింహమూర్తి, సీనియర్ సిటిజన్ సంస్థ సభ్యులు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
5 రోజుల క్రితం
Logo

కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి

కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ జీవీఎంసీ 110, 111 వార్డుల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం అనకాపల్లి (ప్రజాముద్ర): జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ పిలుపునిచ్చారు. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, కూటమి రథసారథి భీమరశెట్టి రామ్కి ఆదేశాల మేరకు...

ముఖ్యమైన పాయింట్స్:

  • కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్
  • జీవీఎంసీ 110, 111 వార్డుల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం
అనకాపల్లి (ప్రజాముద్ర): జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ పిలుపునిచ్చారు. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, కూటమి రథసారథి భీమరశెట్టి రామ్కి ఆదేశాల మేరకు అనకాపల్లి పట్టణంలోని 110, 111 వార్డుల్లో బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ​110వ వార్డులో అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం: 110వ వార్డు పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల పెద్ద రెల్లి వీధిలో నిర్వహించిన ప్రచారంలో సబ్బవరపు గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక చొరవతో 110, 112 డివిజన్లలో దాదాపు ₹1.60 కోట్ల నిధులతో శ్రీరామ్ నగర్, ఏఎంసీ కాలనీ, పెదరెల్లి వీధుల్లో సామాజిక భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న కూటమికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. ​ఈ ఎన్నికల్లో కూటమి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి తాడి శాంత కుమారిని 'గాజు గ్లాస్' గుర్తుపై, కూటమి టీడీపీ మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్క శ్రావణిని 'సైకిల్' గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ​111వ వార్డులో ఇంటింటి ప్రచారం: అనంతరం 111వ వార్డు పరిధిలోని భీముని గుమ్మం వీధి (185, 186 పోలింగ్ కేంద్రాల పరిధి) లో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పలక యశోదకు 'కమలం' గుర్తుపై, మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్క శ్రావణికి 'సైకిల్' గుర్తుపై ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కాయల ప్రసన్నలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త ఎల్లబెల్లి ధనలక్ష్మి, స్థానిక మహిళలు, కూటమి శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
5 రోజుల క్రితం
Logo

జిల్లాలో 'ఆర్నాబ్' తుఫాను సహాయక చర్యలు: రూ. 2.05 కోట్లకు పైగా ముందస్తు నిధులు విడుదల

అనకాపల్లి జిల్లాలో 'ఆర్నాబ్' తుఫాను సహాయక చర్యలు: రూ. 2.05 కోట్లకు పైగా ముందస్తు నిధులు విడుదల చేసిన కలెక్టర్ విజయ కృష్ణన్ ​తుఫాను ముందస్తు ఏర్పాట్లు, సహాయక చర్యల కోసం నిధుల కేటాయింపు ​రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య తదితర శాఖలకు నిధుల బదిలీ ​అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని కలెక్టర్ ఆదేశం ప్రజాముద్ర, అనకాపల్లి: జిల్లాలో దూసుకొస్తున్న "ఆర్నాబ్" తుఫాను ప్రభావం నేపథ్యంలో, ముందస్తు రక్షణ మరియు సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- (రెండు కోట్ల ఐదు లక్షల యాభై వేల రూపాయలు) ముందస్తు నిధులను విడుదల చేసినట్లు...

ముఖ్యమైన పాయింట్స్:

  • అనకాపల్లి జిల్లాలో 'ఆర్నాబ్' తుఫాను సహాయక చర్యలు: రూ. 2.05 కోట్లకు పైగా ముందస్తు నిధులు విడుదల చేసిన కలెక్టర్ విజయ కృష్ణన్
  • ​తుఫాను ముందస్తు ఏర్పాట్లు, సహాయక చర్యల కోసం నిధుల కేటాయింపు
  • ​రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య తదితర శాఖలకు నిధుల బదిలీ
  • ​అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని కలెక్టర్ ఆదేశం
ప్రజాముద్ర, అనకాపల్లి: జిల్లాలో దూసుకొస్తున్న "ఆర్నాబ్" తుఫాను ప్రభావం నేపథ్యంలో, ముందస్తు రక్షణ మరియు సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- (రెండు కోట్ల ఐదు లక్షల యాభై వేల రూపాయలు) ముందస్తు నిధులను విడుదల చేసినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. తుఫాను ముంచుకొస్తున్న తరుణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వివిధ ప్రభుత్వ శాఖలకు, అధికారులకు ఈ నిధులను కేటాయించినట్లు ఆమె స్పష్టం చేశారు. ​శాఖల వారీగా కేటాయించిన నిధుల వివరాలు: ​రెవెన్యూ అధికారులు: 24 మంది తహశీల్దార్లకు రూ. 86 లక్షలు, ముగ్గురు ఆర్డీవోలకు రూ. 21 లక్షలు, అనకాపల్లి కలెక్టరేట్‌కు రూ. 3 లక్షలు. ​స్థానిక సంస్థలు: 24 మంది ఎంపీడీవోలకు (ఒక్కొక్కరికి రూ. 1.00 లక్ష చొప్పున) రూ. 24 లక్షలు. ​భద్రత & రక్షణ: రోడ్లు మరియు భవనాల శాఖ (R&B) ఈఈకి రూ. 20 లక్షలు, జిల్లా ఎస్పీ (SP) కి రూ. 5 లక్షలు, జిల్లా అగ్నిమాపక అధికారికి రూ. 5 లక్షలు. ​తాగునీరు & సాగునీరు: నీటిపారుదల శాఖ ఈఈ (చోడవరం & నర్సీపట్నం, రూ. 5 లక్షల చొప్పున) రూ. 10 లక్షలు, పంచాయతీ రాజ్ ఈఈ (అనకాపల్లి & నర్సీపట్నం, రూ. 5 లక్షల చొప్పున) రూ. 10‌ లక్షలు, గ్రామీణ నీటి సరఫరా (RWS) ఈఈకి రూ. 5 లక్షలు. ​వ్యవసాయం & అనుబంధ రంగాలు: జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి రూ. 5 లక్షలు, జిల్లా మత్స్యశాఖ అధికారికి రూ. 2 లక్షలు, ఉద్యానవన శాఖ అధికారికి రూ. 1 లక్ష, పట్టు పరిశ్రమ శాఖ అధికారికి రూ. 50 వేలు. ​వైద్యారోగ్య శాఖ: జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్తకు (DCHS) రూ. 3 లక్షలు, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రూ. 2 లక్షలు, అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు (CHCs, ఒక్కోదానికి రూ. 50,000 చొప్పున) రూ. 3 లక్షలు. ​తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు తక్షణమే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
5 రోజుల క్రితం
Logo

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు

అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల సమరం: బరిలో 80 మంది జడ్పీటీసీ, 979 మంది ఎంపీటీసీ అభ్యర్థులు పోలింగ్ నవంబర్ 5న, కౌంటింగ్ 7న రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజాముద్ర, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5వ తేదీన ఉదయం 7:00 గంటల...

ముఖ్యమైన పాయింట్స్:

  • అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల సమరం: బరిలో 80 మంది జడ్పీటీసీ, 979 మంది ఎంపీటీసీ అభ్యర్థులు
  • పోలింగ్ నవంబర్ 5న, కౌంటింగ్ 7న
  • రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
ప్రజాముద్ర, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం నవంబర్ 7వ తేదీన ఉదయం 8:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల బరిలో అభ్యర్థుల వివరాలు: జిల్లాలోని మొత్తం 24 జడ్పీటీసీ స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 427 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 425 స్థానాలకు 979 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. రెండు స్థానాలు ఏకగ్రీవం: ఎస్.రాయవరం మండలంలోని పెద్ద గుమ్మలూరు ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏజర్ల అనిల్ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం-1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి లాలం నాగలక్ష్మి ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
6 రోజుల క్రితం
Logo

అర్నబ్' తుపాను ముప్పు: రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

అండర్ బ్రిడ్జ్ కింద నీరు నిలవకుండా చూడండి: అధికారులకు కలెక్టర్ ఆదేశం ​తుపాను వేళ అప్రమత్తం: అనకాపల్లిలో ఫ్లైఓవర్, రైల్వే పనులను తనిఖీ చేసిన కలెక్టర్, జేసీ ​రహదారులు, డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు ​తుపాను ప్రభావంతో రాకపోకలకు ఆటంకం కలగొద్దు: ప్రత్యామ్నాయ రహదారులపై కలెక్టర్ దిశానిర్దేశం అనకాపల్లి (అక్టోబర్ 28, బుధవారం): 'అర్నబ్' తుపాను హెచ్చరికల నేపథ్యంలో అనకాపల్లి పట్టణంలోని ఫ్లైఓవర్, రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) పనులను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్‌తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ సందర్భంగా జిల్లా...

ముఖ్యమైన పాయింట్స్:

  • అండర్ బ్రిడ్జ్ కింద నీరు నిలవకుండా చూడండి: అధికారులకు కలెక్టర్ ఆదేశం
  • ​తుపాను వేళ అప్రమత్తం: అనకాపల్లిలో ఫ్లైఓవర్, రైల్వే పనులను తనిఖీ చేసిన కలెక్టర్, జేసీ
  • ​రహదారులు, డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు
  • ​తుపాను ప్రభావంతో రాకపోకలకు ఆటంకం కలగొద్దు: ప్రత్యామ్నాయ రహదారులపై కలెక్టర్ దిశానిర్దేశం
అనకాపల్లి (అక్టోబర్ 28, బుధవారం): 'అర్నబ్' తుపాను హెచ్చరికల నేపథ్యంలో అనకాపల్లి పట్టణంలోని ఫ్లైఓవర్, రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) పనులను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్‌తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... తుపాను ప్రభావంతో కురిసే భారీ వర్షాల వల్ల అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిని ఎప్పటికప్పుడు తోడివేసేందుకు భారీ సామర్థ్యం కలిగిన డ్రైనేజీ పంపులు, మోటార్లను అందుబాటులో ఉంచాలని, డ్రైనేజీ కాలువల పూడికతీత పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ​అలాగే రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనుల్లో ఎటువంటి నాణ్యతా లోపాలు ఉండకూడదని ఆర్‌ అండ్ బి, రైల్వే, మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. పనుల వల్ల ప్రజలకు ఎటువంటి రాకపోకల ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు శాఖకు సూచించారు. ​ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లతో పాటు రైల్వే ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఆర్‌ అండ్ బి ఈఈ, మున్సిపల్ కమిషనర్ తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
6 రోజుల క్రితం
Logo

అర్ణబ్ తుపాను బీభత్సం: జాతీయ రహదారిపై విరిగిపడిన భారీ వృక్షాలు!

​స్తంభించిన రాకపోకలు.. వర్షంలోనూ రంగంలోకి దిగిన పోలీసులు, అధికార యంత్రాంగం ​యుద్ధప్రాతిపదికన చెట్ల తొలగింపు.. ట్రాఫిక్ పునరుద్ధరణ అనకాపల్లి క్రైమ్ బ్యూరో: అర్ణబ్ తుపాను ప్రభావంతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర గాలుల ధాటికి మంగళవారం రాత్రి అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ​డైట్ కాలేజీ వద్ద 20 నిమిషాల్లోనే...

ముఖ్యమైన పాయింట్స్:

  • ​స్తంభించిన రాకపోకలు.. వర్షంలోనూ రంగంలోకి దిగిన పోలీసులు, అధికార యంత్రాంగం
  • ​యుద్ధప్రాతిపదికన చెట్ల తొలగింపు.. ట్రాఫిక్ పునరుద్ధరణ
అనకాపల్లి క్రైమ్ బ్యూరో: అర్ణబ్ తుపాను ప్రభావంతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర గాలుల ధాటికి మంగళవారం రాత్రి అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ​డైట్ కాలేజీ వద్ద 20 నిమిషాల్లోనే క్లియరెన్స్ ​అనకాపల్లి నేషనల్ హైవేపై డైట్ (DIET) ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో భారీ వృక్షం కూలిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే జోనల్ కమిషనర్ శ్రీ చక్రవర్తి, ఎంఆర్వో శ్రీ ఆనందరావు, అనకాపల్లి ట్రాఫిక్ సీఐ శ్రీ నాగేశ్వరరావు, టౌన్ సీఐ శ్రీ ప్రేమ్ కుమార్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివిధ శాఖల సమన్వయంతో అధికారులు రంగంలోకి దిగి కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే రోడ్డుకు అడ్డంగా పడిన భారీ చెట్టును తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ​కొప్పాక, ఆర్టీవో ఆఫీస్ వద్ద రాత్రి వేళ సహాయక చర్యలు ​మరోవైపు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొప్పాక, ఆర్టీవో ఆఫీస్ సమీపంలో జాతీయ రహదారిపై మరో రెండు పెద్ద చెట్లు కూలిపోయాయి. చీకటి, ఎడతెరిపిలేని భారీ వర్షం, భీకర గాలులను సైతం లెక్కచేయకుండా అనకాపల్లి రూరల్ సీఐ శ్రీ జి. అశోక్ కుమార్, ఎస్ఐ శ్రీ జి. రవి కుమార్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జీవీఎంసీ (GVMC) సిబ్బంది సహకారంతో హైవేపై పడిన చెట్ల కొమ్మలను నరికివేసి రహదారిని క్లియర్ చేశారు. ​తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పనితీరుపై స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రశంసలు కురిపించారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
6 రోజుల క్రితం
Logo

పెద్దేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత.. లోతట్టు ప్రాంతాలకు తీవ్ర హెచ్చరికలు!

ఆర్నాబ్’ తుపానుతో పోటెత్తుతున్న వరద నీరు.. దిగువకు భారీగా విడుదల ​6 మండలాల పరిధిలోని గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ విజయకృష్ణన్ అనకాపల్లి:బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నాబ్’ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు...

ముఖ్యమైన పాయింట్స్:

  • ఆర్నాబ్’ తుపానుతో పోటెత్తుతున్న వరద నీరు.. దిగువకు భారీగా విడుదల
  • ​6 మండలాల పరిధిలోని గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి:బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నాబ్’ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఒక అత్యవసర ప్రకటనలో హెచ్చరించారు. వరద ఉధృతి నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ​ముంపు ముప్పు పొంచి ఉన్న మండలాలు – గ్రామాలు: ​మాడుగుల మండలం: పోతనపూడి, వీ.వీ. అగ్రహారం ​అనకాపల్లి మండలం: తగరంపూడి, వెంకుపాలెం, సీతానగరం, తుంపాల, సత్యనారాయణపురం, కొత్తూరు ​బుచ్చయ్యపేట మండలం: వడ్డాది, విజయరామరాజుపేట పరిసర ప్రాంతాలు ​చోడవరం మండలం: గౌరీపట్నం, జన్నవరం, బెన్నవోలు, పి.ఎస్. పేట ​కశింకోట మండలం: కశింకోట, తేగాడ, పెరంటాలపాలెం, జోగారావుపేట ​రాంబిల్లి మండలం: కొత్తూరు, రజాల గ్రామాలు ​ప్రజలకు జిల్లా యంత్రాంగం ముఖ్య సూచనలు: ​నదులు, వాగుల వైపు వెళ్లొద్దు: కాలువలు, కాజ్‌వేలు, నదీ తీరాల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దు. వరద ఉధృతిని చూసేందుకు వంతెనలపై గుమిగూడటం నిషేధం. ​పశువుల రక్షణ బాధ్యత: పశువులు, గొర్రెలు, మేకలను నదీ ప్రవాహ ప్రాంతాలకు మేత కోసం తోలకూడదు. వాటిని ముందుగానే ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ​అధికారుల ఆదేశాలు పాటించండి: లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. ​అత్యవసర సమాచారం: పుకార్లను నమ్మవద్దు. అత్యవసర సహాయం కోసం గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని లేదా సమీప పోలీస్ స్టేషన్, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
8 రోజుల క్రితం
Logo

అర్నాబ్ తుఫాన్ తీవ్ర హెచ్చరికలు: అనకాపల్లి జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు

అర్నాబ్ తుఫాను అక్టోబర్ 28న బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరప్రాంత జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. ​బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మరియు విద్యుత్ శాఖ పర్యవేక్షక...

ముఖ్యమైన పాయింట్స్:

  • అర్నాబ్ తుఫాను అక్టోబర్ 28న బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
  • ఈ తుఫాను సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
  • తీరప్రాంత జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.
​బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మరియు విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి. ప్రసాద్ ప్రజలకు, రైతులకు మరియు సిబ్బందికి పలు అత్యవసర ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ​1. పాఠశాలలు & అంగన్‌వాడీలకు 3 రోజులు సెలవులు ​విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27 నుంచి 29 వరకు (మూడు రోజులు) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ​2. విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ & హెల్ప్‌లైన్ నంబర్లు ​అనకాపల్లి జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో 24 గంటల పాటు (3 షిఫ్టులలో) పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటయింది. ​24x7 సర్కిల్ కంట్రోల్ రూమ్: 8712410720 (LMC అనకాపల్లి) ​విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్: 1912 ​డివిజన్ల వారీగా వాట్సాప్ ఫిర్యాదు నంబర్లు: ​అనకాపల్లి డివిజన్: 9063110544 ​కశింకోట డివిజన్: 8333810597 ​నర్సీపట్నం డివిజన్: 9491030714 ​3. ముందస్తు రక్షణ చర్యలు & వైద్య ఏర్పాట్లు ​తీరప్రాంతాలు: పరవాడ నుంచి పాయకరావుపేట వరకు ఉన్న 6 తీర మండలాల్లోని మత్స్యకార గ్రామాలు, గిరిజన సబ్ ప్లాన్ గ్రామాలు మరియు వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు అప్రమత్తం చేశారు. ​మత్స్యకారులకు ఆదేశాలు: మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు. బోట్లను తీరానికి దూరంగా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి; తుఫాన్ సమయంలో బోట్లను చూసేందుకు వెళ్లకూడదు. ​గర్భిణీ స్త్రీల సంరక్షణ: రాబోయే వారం రోజుల్లో ప్రసవమయ్యే అవకాశం ఉన్న గర్భిణులను గుర్తించి సమీపంలోని PHC, CHC, ఏరియా లేదా జిల్లా ఆసుపత్రులకు ముందస్తుగానే తరలిస్తున్నారు. ​పునరావాస కేంద్రాలు: కచ్చా ఇళ్లలో ఉన్నవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ కేంద్రాలకు చేరుకోవాలి. ​4. ప్రజలు పాటించాల్సిన కీలక జాగ్రత్తలు ​విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ముందుగానే వాటర్ ట్యాంకులను నింపి ఉంచుకోవాలి. ​వర్షం వల్ల తెగిపడిన విద్యుత్ తీగలు, తడిసిన స్తంభాలు, తీగలపై పడిన కొమ్మలను ముట్టుకోరాదు. ​సురక్షితమైన తాగునీటి కోసం కాచి చల్లార్చిన నీటిని తాగాలి, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ​ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగ్‌ల కింద నిలబడవద్దు. ​5. రైతులకు సూచనలు ​అరటి, కొబ్బరి, తమలపాకు, పోక (అరేకానట్) వంటి పంటలకు చెట్లు పడిపోకుండా తాత్కాలిక ఊతాలు (సపోర్ట్) ఏర్పాటు చేసుకోవాలి. ​కోత దశకు వచ్చిన పంటల హార్వెస్టింగ్‌ను వెంటనే పూర్తి చేయాలి. ఎక్కడైనా నీరు నిలిచిపోతే స్థానిక రైతు సేవా కేంద్రాల (RSK) సిబ్బందిని సంప్రదించాలి.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
9 రోజుల క్రితం
Logo

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ- ట్రాఫిక్ సీఐ కె. నాగేశ్వరరావు

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ✔️ మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దు. ✔️ అతివేగం, ట్రిపుల్ రైడింగ్ ప్రాణాంతకం. ✔️ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి. ✔️ బస్సులు, ఆటోలు ఎక్కేటప్పుడు/దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అనకాపల్లి:(ప్రజాముద్ర ప్రతినిధి) రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూడిమడక జంక్షన్ వద్ద వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మరియు అనకాపల్లి ఎస్డీపీవోల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ శ్రీ కె. నాగేశ్వరరావు...

ముఖ్యమైన పాయింట్స్:

  • ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
  • ✔️ మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దు.
  • ✔️ అతివేగం, ట్రిపుల్ రైడింగ్ ప్రాణాంతకం.
  • ✔️ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి.
  • ✔️ బస్సులు, ఆటోలు ఎక్కేటప్పుడు/దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
అనకాపల్లి:(ప్రజాముద్ర ప్రతినిధి) రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూడిమడక జంక్షన్ వద్ద వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మరియు అనకాపల్లి ఎస్డీపీవోల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ శ్రీ కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. ముఖ్యంగా: హెల్మెట్ తప్పనిసరి: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం తాగి డ్రైవింగ్ వద్దు: మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం నిషేధం: అతివేగం, అజాగ్రత్త మరియు ట్రిపుల్ రైడింగ్ ప్రమాదాలకు ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు: మైనర్ బాలబాలికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. సిగ్నల్ నియమాలు: ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఖచ్చితంగా పాటించాలి. ప్రయాణికులకు సూచనలు: ఆటోలు, బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం తగదని ప్రయాణికులకు హితవు పలికారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని, మన ప్రాణాలతో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన వారవుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, స్థానిక వాహనదారులు, ప్రయాణికులు పాల్గొన్నారు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
10 రోజుల క్రితం
Logo

కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ సందేశాలు: అప్రమత్తంగా ఉండాలన్న యంత్రాంగం

​అనకాపల్లి: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సాప్ సందేశాలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ​గత రెండు రోజులుగా కలెక్టర్ పేరు, నకిలీ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాట్సాప్‌లో పలు తప్పుడు సందేశాలు, సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను పరిశీలించకుండా నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని స్పష్టం చేశారు....

​అనకాపల్లి: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సాప్ సందేశాలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ​గత రెండు రోజులుగా కలెక్టర్ పేరు, నకిలీ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాట్సాప్‌లో పలు తప్పుడు సందేశాలు, సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను పరిశీలించకుండా నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని స్పష్టం చేశారు. నకిలీ సందేశాలు సృష్టించే వారిపై, వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
11 రోజుల క్రితం
Logo

అనకాపల్లి జీవీఎంసీ వార్డుల్లో ఎన్నికల సందడి: తేలిన అభ్యర్థుల తుది జాబితా.. బరిలో 19 మంది!

మొత్తం వార్డులు: అనకాపల్లి జోన్ పరిధిలోని 6 వార్డులు (107, 108, 109, 110, 111, 112). ​పోటీలో ఉన్న అభ్యర్థులు: మొత్తం 19 మంది. ​ఉపసంహరించుకున్న నామినేషన్లు: మొత్తం 14 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు (107-109 వార్డుల్లో 6 మంది, 110-112 వార్డుల్లో 8 మంది). ​పోలింగ్ వివరాలు: 2026 అక్టోబర్ 28న ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు. అనకాపల్లి:గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని అనకాపల్లి జోన్‌కు చెందిన 107 నుండి 112 వార్డుల వార్డు మెంబర్ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ తుది...

ముఖ్యమైన పాయింట్స్:

  • మొత్తం వార్డులు: అనకాపల్లి జోన్ పరిధిలోని 6 వార్డులు (107, 108, 109, 110, 111, 112).
  • ​పోటీలో ఉన్న అభ్యర్థులు: మొత్తం 19 మంది.
  • ​ఉపసంహరించుకున్న నామినేషన్లు: మొత్తం 14 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు (107-109 వార్డుల్లో 6 మంది, 110-112 వార్డుల్లో 8 మంది).
  • ​పోలింగ్ వివరాలు: 2026 అక్టోబర్ 28న ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
అనకాపల్లి:గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని అనకాపల్లి జోన్‌కు చెందిన 107 నుండి 112 వార్డుల వార్డు మెంబర్ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల అధికారులు అధికారికంగా తుది పోటీదారుల జాబితాను (ఫారం-XI) ప్రకటించారు. మొత్తం 6 వార్డులలో కలిపి 14 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, చివరకు 19 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ 6 వార్డులకు సంబంధించి ఈ నెల 28న ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ​వార్డుల వారీగా సమగ్ర వివరాలు: ​107వ వార్డు (రిజర్వేషన్: బీసీ మహిళ) ​ఈ వార్డులో మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. ​వెంకట లక్ష్మి పన్నీరు (వైఎస్సార్‌సీపీ): ​విద్యార్హత: ఎస్సెస్సీ (SSC) | వయస్సు: 44 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 3-2-134, పాఠశాల దగ్గర, సిరసపల్లి గ్రామం, అనకాపల్లి మండలం ​గుర్తు: పంఖా (సీలింగ్ ఫ్యాన్) ​చినతల్లి మాదంశెట్టి (టీడీపీ): ​విద్యార్హత: నిరక్షరాస్యురాలు | వయస్సు: 61 ఏళ్లు | వృత్తి: వ్యాపారం ​చిరునామా: డోర్ నెం: 1-56, చినతాడి గ్రామం, పరవాడ మండలం ​గుర్తు: సైకిల్ ​ఉపసంహరించుకున్న వారు: బల్లినా లక్ష్మీబాయి (స్వతంత్ర), శిరంశెట్టి రేణుక (స్వతంత్ర), పన్నీరు వరలక్ష్మి (స్వతంత్ర). ​108వ వార్డు (రిజర్వేషన్: బీసీ మహిళ) ​ఈ వార్డులో ప్రధాన పార్టీలతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉండటంతో త్రిముఖ పోరు ఏర్పడింది. ​సిందూజ కొణతాల (టీడీపీ): ​విద్యార్హత: బి.ఎ. (B.A.) | వయస్సు: 40 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 14-16-7, నిధానందొడ్డి, గవరపాలెం, అనకాపల్లి ​గుర్తు: సైకిల్ ​సరోజిని బొడ్డేడ (వైఎస్సార్‌సీపీ): ​విద్యార్హత: ఇంటర్మీడియట్ | వయస్సు: 47 ఏళ్లు | వృత్తి: వ్యాపారం ​చిరునామా: డోర్ నెం: 12-16-41, భోగలింగేశ్వర స్వామి గుడి వీధి, అగ్గిమర్రిచెట్టు దగ్గర, గవరపాలెం, అనకాపల్లి ​గుర్తు: పంఖా (సీలింగ్ ఫ్యాన్) ​తులసి పెంటకోట (స్వతంత్ర అభ్యర్థి): ​విద్యార్హత: బి.ఎ. (B.A.) | వయస్సు: 33 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 15-16-62, పి.వి.ఆర్. నాయుడు వీధి, గవరపాలెం, అనకాపల్లి ​గుర్తు: ఎయిర్ కండీషనర్ ​ఉపసంహరించుకున్న వారు: మళ్ళ కృష్ణకుమారి (బీజేపీ). ​109వ వార్డు (రిజర్వేషన్: బీసీ మహిళ) ​ఇక్కడ వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ​లలిత కర్రి (వైఎస్సార్‌సీపీ): ​విద్యార్హత: ఎస్సెస్సీ (SSC) | వయస్సు: 41 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 18-1-14, నెయ్యల వీధి, గవరపాలెం, అనకాపల్లి ​గుర్తు: పంఖా (సీలింగ్ ఫ్యాన్) ​కోరిబిల్లి నూక భారతి (భారత జాతీయ కాంగ్రెస్): ​విద్యార్హత: ఇంటర్మీడియట్ | వయస్సు: 36 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 17-5-69, సంత బయలు, గవరపాలెం, అనకాపల్లి ​గుర్తు: హస్తం ​జ్యోతి బుద్ధ (జనసేన పార్టీ): ​విద్యార్హత: ఇంటర్మీడియట్ | వయస్సు: 30 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 20-1-61, దేముడుతోట వీధి, గవరపాలెం, అనకాపల్లి ​గుర్తు: గాజు గ్లాస్ ​ఉపసంహరించుకున్న వారు: బొడ్డేడ వరలక్ష్మి (స్వతంత్ర), కర్రి పూజిత (స్వతంత్ర). ​110వ వార్డు (రిజర్వేషన్: మహిళ - జనరల్) ​ఈ వార్డులో చతుర్ముఖ పోటీ నెలకొంది. ​జోష్ణ పద్మజ ఉగ్గిన (వైఎస్సార్‌సీపీ): ​విద్యార్హత: ఎస్సెస్సీ (SSC) | వయస్సు: 30 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 6-5-32, వేల్పుల వీధి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం దగ్గర, అనకాపల్లి ​గుర్తు: పంఖా ​గౌరిపట్నపు దేవి (భారత జాతీయ కాంగ్రెస్): ​కులం: బీసీ-బి (విశ్వబ్రాహ్మణ) | విద్యార్హత: ఎస్సెస్సీ (SSC) | వయస్సు: 40 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 1-11-14, అంజయ్య కాలనీ, గాంధీనగర్, అనకాపల్లి ​గుర్తు: హస్తం ​తాడి శాంతి కుమారి (జనసేన పార్టీ): ​కులం: బీసీ-డి (తూర్పు కాపు) | విద్యార్హత: ఎంబీఏ (MBA) | వయస్సు: 38 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 12-5-78, బారు వారి వీధి, అనకాపల్లి ​గుర్తు: గాజు గ్లాస్ ​దుర్గాదేవి పర్రి (బహుజన్ సమాజ్ పార్టీ - బీఎస్పీ): ​విద్యార్హత: ఎస్సెస్సీ (SSC) | వయస్సు: 32 ఏళ్లు | వృత్తి: వ్యాపారం ​చిరునామా: డోర్ నెం: 2-30-33, విజయరామరాజుపేట, అనకాపల్లి ​గుర్తు: ఏనుగు ​ఉపసంహరించుకున్న వారు: సుబ్బలక్ష్మి టెంకాల (వైఎస్సార్‌సీపీ), తాకాశి సూర్య పద్మ (వైఎస్సార్‌సీపీ), వీసం కనకమహాలక్ష్మి (బీజేపీ). ​111వ వార్డు (రిజర్వేషన్: బీసీ మహిళ) ​ఈ వార్డులో అత్యధికంగా 5 గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ​పలకా యశోద (భారతీయ జనతా పార్టీ - బీజేపీ): ​విద్యార్హత: డిగ్రీ (Degree) | వయస్సు: 37 ఏళ్లు | వృత్తి: వ్యాపారం ​చిరునామా: డోర్ నెం: 2-7-1, విజయరామరాజుపేట, అనకాపల్లి ​గుర్తు: కమలం ​శీలం నదియ @ దళాయి నదియ (వైఎస్సార్‌సీపీ): ​విద్యార్హత: ఇంటర్మీడియట్ | వయస్సు: 32 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 9-7-8/1, కొణతాల వీధి, అనకాపల్లి ​గుర్తు: పంఖా ​కోలపర్తి అరుణ కుమారి (స్వతంత్ర అభ్యర్థి): ​విద్యార్హత: పి.యు.సి. (PUC) | వయస్సు: 50 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 13-2-31, మసీదు వీధి, అనకాపల్లి ​గుర్తు: బీరువా ​దేవి బోనాల (స్వతంత్ర అభ్యర్థి): ​విద్యార్హత: ఎస్సెస్సీ (SSC) | వయస్సు: 47 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 7-11-32, లోక వారి వీధి, అనకాపల్లి ​గుర్తు: కొబ్బరికాయ ​జ్యోతి శానాపతి @ జ్యోతి సేనాపతి (స్వతంత్ర అభ్యర్థి): ​విద్యార్హత: ఎస్సెస్సీ (SSC) | వయస్సు: 27 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 9-3-22, కొట్ని వీధి, రామాలయం దగ్గర, అనకాపల్లి ​గుర్తు: ఎయిర్ కండీషనర్ ​ఉపసంహరించుకున్న వారు: శ్రీకాకుళపు వరాహ వెంకటలక్ష్మి (వైఎస్సార్‌సీపీ), గేదేల దేవి సూర్యమణి దీపిక (బీజేపీ), కాతా వెంకటలక్ష్మి (టీడీపీ), మజ్జి మంజుల (టీడీపీ). ​112వ వార్డు (రిజర్వేషన్: మహిళ - జనరల్) ​ఈ వార్డులో ఉన్నత విద్యావంతులైన ముగ్గురు మహిళల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ​వైష్ణవి అల్ల @ వైష్ణవి ఆళ్ళ (జనసేన పార్టీ): ​కులం: బీసీ-డి (గవర) | విద్యార్హత: ఫార్మా-డి (Pharma-D) | వయస్సు: 28 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 12-165, గుండాల వీధి, BC బాలికల హాస్టల్ పక్కన, సాయి నగర్, అనకాపల్లి ​గుర్తు: గాజు గ్లాస్ ​ప్రసన్న లక్ష్మి జాజుల (వైఎస్సార్‌సీపీ): ​కులం: బీసీ-డి (తూర్పు కాపు) | విద్యార్హత: బి.ఎడ్. (B.Ed) | వయస్సు: 31 ఏళ్లు | వృత్తి: గృహిణి ​చిరునామా: డోర్ నెం: 4-9-16, మిర్యాల కాలనీ, అనకాపల్లి ​గుర్తు: పంఖా ​తుట్ట ప్రియాంక (భారత జాతీయ కాంగ్రెస్): ​కులం: బీసీ-ఎ (యాత) | విద్యార్హత: బి.ఎ. ఎల్‌ఎల్‌బీ (BA LLB) | వయస్సు: 25 ఏళ్లు | వృత్తి: హైకోర్టు న్యాయవాది ​చిరునామా: డోర్ నెం: 4-7-34/A, మిర్యాల కాలనీ, అనకాపల్లి ​గుర్తు: హస్తం ​ఉపసంహరించుకున్న వారు: జాజుల ధనలక్ష్మి (వైఎస్సార్‌సీపీ). ​నామినేషన్ల ఉపసంహరణ ముగిసి గుర్తులు కేటాయించడంతో అన్ని వార్డుల్లో ప్రచారం ముమ్మరమైంది. పోలింగ్ కేంద్రాలు మరియు ఏర్పాట్లపై ఎన్నికల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
12 రోజుల క్రితం
Logo

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా

నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పహారా 100 మీటర్ల పరిధిలోకి నలుగురికే ప్రవేశం బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన అనకాపల్లి, అక్టోబర్ 22 (ప్రజాముద్ర ప్రతినిధి): జిల్లాలో జరుగుతున్న ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకు చేరిన నేపథ్యంలో బుధవారం ఆయన బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట మండల పరిషత్ కార్యాలయాలు (MPDO), జిల్లా పరిషత్ కార్యాలయ పరిసరాల్లోని నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు....

ముఖ్యమైన పాయింట్స్:

  • నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పహారా
  • 100 మీటర్ల పరిధిలోకి నలుగురికే ప్రవేశం
  • బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
అనకాపల్లి, అక్టోబర్ 22 (ప్రజాముద్ర ప్రతినిధి): జిల్లాలో జరుగుతున్న ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకు చేరిన నేపథ్యంలో బుధవారం ఆయన బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట మండల పరిషత్ కార్యాలయాలు (MPDO), జిల్లా పరిషత్ కార్యాలయ పరిసరాల్లోని నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం చుట్టూ ఉన్న 100 మీటర్ల పరిధిని అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణించాలని, అక్కడ ప్రజలు గుమిగూడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేర్వేరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తకుండా 100 మీటర్ల అవతలే నియంత్రించాలని సూచించారు. అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి నామినేషన్ దాఖలు చేసే సమయంలో కేంద్రం లోపలికి అభ్యర్థితో పాటు గరిష్టంగా నలుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ తెలిపారు. నామినేషన్ పూర్తయిన వెంటనే అభ్యర్థులు, వారి అనుచరులు అక్కడే ఉండకుండా వెంటనే వెనుదిరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వివిధ రాజకీయ పార్టీలు ఒకే సమయంలో కాకుండా వేర్వేరు వేళల్లో ర్యాలీలు నిర్వహించుకునేలా సమన్వయం చేసుకోవాలని కోరారు. డ్రోన్ నిఘా... అమల్లో సెక్షన్ 163 BNSS ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. (గతంలో 144 సెక్షన్) అమల్లో ఉన్నాయని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల సజావుగా సాగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్సైలు మనోజ్ కుమార్, శ్రీనివాస్, రామకృష్ణారావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
12 రోజుల క్రితం
Logo

కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి

108వ డివిజన్‌లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం పాల్గొన్న గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర అనకాపల్లి (ప్రజామద్ర ప్రతినిధి):అనకాపల్లి పట్టణం 108వ వార్డు పరిధిలో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. స్థానిక టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొణతాల సింధుజకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర కూటమి నాయకులతో కలిసి గురువారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మళ్ళా సురేంద్ర మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని...

ముఖ్యమైన పాయింట్స్:

  • 108వ డివిజన్‌లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం
  • పాల్గొన్న గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర
అనకాపల్లి (ప్రజామద్ర ప్రతినిధి):అనకాపల్లి పట్టణం 108వ వార్డు పరిధిలో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. స్థానిక టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొణతాల సింధుజకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర కూటమి నాయకులతో కలిసి గురువారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మళ్ళా సురేంద్ర మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా చేరవేస్తున్నామని తెలిపారు. పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యం కావాలంటే కూటమి ప్రతినిధులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కార్పొరేటర్ అభ్యర్థి కొణతాల సింధుజను, అలాగే మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణిని అత్యధిక మెజారిటీతో విజయతీరాలకు చేర్చాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రముఖ నాయకులు కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు, కొణతాల జగ్గారావు నాయుడు, కాండ్రేగుల జగ్గారావు, పొలిమేర నాయుడు, పెంటకోట శ్రీనివాసరావుతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • Anakapalli News
Reporter
PRAJAMUDRA
13 రోజుల క్రితం
Logo

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్

అనకాపల్లి, అక్టోబర్ 21:ఎన్నికల నిర్వహణలో అధికారులు అత్యంత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, జిల్లా స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గత ఘటనలు, కేసుల వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎస్హెచ్ఓలు, తహసీల్దార్ల నుంచి సేకరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్గ, మండల...

అనకాపల్లి, అక్టోబర్ 21:ఎన్నికల నిర్వహణలో అధికారులు అత్యంత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, జిల్లా స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గత ఘటనలు, కేసుల వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎస్హెచ్ఓలు, తహసీల్దార్ల నుంచి సేకరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్గ, మండల పటాల ఆధారంగా సున్నిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల ఓటర్లను ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసినా, ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం లేదా బెదిరించడం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 171 ప్రకారం తీవ్ర నేరమని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు పూర్ణిమ దేవి పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలను వాటి తీవ్రత ఆధారంగా విభజించి, ఆ వివరాలను నిర్దేశిత ప్రొఫార్మా-1 ద్వారా ముందస్తుగా సమర్పించాలని నిర్దేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎస్ఈసీఎంఎస్ మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు. ఓటర్లు రాని ప్రాంతాలపై ప్రత్యేక నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 అనకాపల్లి • అనకాపల్లి News
Reporter
PRAJAMUDRA
13 రోజుల క్రితం
Logo

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలు – జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం– జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ,ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి, అక్టోబర్ 21:* పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల రక్షణ కోసం ముఖ పరిచయం లేని సాధారణ పౌరుల కోసం ప్రాణాలను...

ముఖ్యమైన పాయింట్స్:

  • పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం– జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ,ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి, అక్టోబర్ 21:* పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల రక్షణ కోసం ముఖ పరిచయం లేని సాధారణ పౌరుల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే గొప్ప వృత్తి యూనిఫాం సర్వీస్. గడచిన రెండేళ్లలో అనకాపల్లి జిల్లా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లాకు రూ.4 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మన పోలీసు విభాగం కల్పిస్తున్న పటిష్టమైన శాంతిభద్రతలు, రక్షణే. పెట్టుబడిదారులకు, ప్రజలకు భయం లేకుండా ముందుకు సాగేలా నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల కృషి ఎంతో గొప్పది. జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం, విద్యావ్యవస్థ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమాజం మరింత ప్రగతిపథంలో పయనిస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది" అని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ "1959 అక్టోబర్ 21న చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ రక్షణ కోసం పోరాడి అసువులు బాసిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల స్మారకార్థం ప్రతి ఏటా ఈ దినాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకరు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. నేడు లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (నక్సలిజం), ఉగ్రవాదం వంటి సమస్యలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు వంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అణచివేసేందుకు పోలీసు సిబ్బంది మరింత ప్రొఫెషనలిజంతో పనిచేయాలి. చట్టపరిధిలో తమ విధులను నిర్భయంగా, నిస్వార్థంగా నిర్వహించినప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. పోలీసు సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడంలో వారి కుటుంబ సభ్యుల పాత్ర, మద్దతు ఎంతో కీలకమైనవి. అమరుల కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది" అని తెలిపారు. ​ఈ సందర్భంగా 1983 నుంచి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ పరిధిలో వీరమరణం పొందిన 27 మంది అమరవీరుల వివరాలను, దేశవ్యాప్తంగా అమరులైన పోలీసుల పేర్లను అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ మరియు ఎస్పీల చేతుల మీదుగా 14 మంది అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.10,000/- చొప్పున నగదు చెక్కులను, జ్ఞాపికలను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, డీఎస్పీలు పి.శ్రీనివాస రావు, శ్రీ పి.వి.వి. నరసింహారావు, వి.బాబ్జీరావు, పరిపాలనాధికారి సిహెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు బాల సూర్యారావు, ప్రేమ కుమార్, అశోక్ కుమార్, నాగేశ్వరరావు, రమేష్, రామకృష్ణారావు, మన్మధరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు మరియు కృష్ణదేవిపేట జడ్పీ హైస్కూల్ ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి

ప్రధాన కేటగిరీలు (Categories)

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు (26)

తెలంగాణ జిల్లాలు (33)