PRAJA MUDRA
రిపోర్టర్
మీ ప్రాంత వార్తల కోసం లొకేషన్ ఆన్ చేయండి
Breaking
⚡ BREAKING

విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సాయం బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్

Breaking
⚡ BREAKING

విజయం సాధించాలంటే ఇవే ముఖ్యం: యువతకు ముఖేష్ అంబానీ 3 సూత్రాలు

ఫ్లిప్ న్యూస్
ప్రపంచం (World)
క్రీడలు (Sports)
ఈ-పేపర్
లైవ్ టీవీ
రీల్స్ / షార్ట్స్
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

ప్రపంచం వార్తలు

అన్ని వార్తలు ×
Thumb
📍 బెంగళూరు

విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సాయం బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్

1 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 ముంబై

విజయం సాధించాలంటే ఇవే ముఖ్యం: యువతకు ముఖేష్ అంబానీ 3 సూత్రాలు

3 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
📍 బెంగళూరు • బెంగళూరు News
Reporter
PRAJAMUDRA
1 రోజుల క్రితం
Logo

విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సాయం బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్

విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సాయం బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్ బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో దాడికి గురై బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో వైద్యులను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పాఠశాలలోకి ఎలక్ట్రికల్ రంపంతో ఓ వ్యక్తి ప్రవేశించి విద్యార్థినులపై...

ముఖ్యమైన పాయింట్స్:

  • విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి
  • ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సాయం
  • బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్
బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో దాడికి గురై బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో వైద్యులను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పాఠశాలలోకి ఎలక్ట్రికల్ రంపంతో ఓ వ్యక్తి ప్రవేశించి విద్యార్థినులపై దాడికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే భద్రత లేకపోతే వారి భవిష్యత్తుకు ఎవరు భరోసా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం, బెల్ట్ షాపుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. మత్తు పదార్థాల ప్రభావం యువతపై పడుతోందని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రూ.50 లక్షల పరిహారం డిమాండ్ గోపిక కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల ఆర్థిక పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. బాధితురాలికి అత్యుత్తమ వైద్యం అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం పరిహారం అందించకపోతే వైఎస్సార్‌సీపీ తరఫున వైద్య ఖర్చులను భరిస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాప్తాడులో శాంతిభద్రతలపై విమర్శలు రాప్తాడు నియోజకవర్గంలో గత 15–16 నెలల కాలంలో మహిళలపై దాడులు, హత్యలు సహా తొమ్మిది తీవ్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని విమర్శించారు. పోలీసు యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గోపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా దాడిలో తీవ్రంగా గాయపడిన గోపికకు బెంగళూరులోని ఆసుపత్రిలో సుమారు 11 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించినట్లు జగన్ తెలిపారు. ఆపరేషన్‌ను బాలిక తట్టుకుందని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించినట్లు చెప్పారు. మరో 48 గంటలు కీలకమని వైద్యులు తెలిపినట్లు వివరించారు. గోపిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన జగన్, బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
📍 ముంబై • Jio News
Reporter
PRAJAMUDRA
3 రోజుల క్రితం
Logo

విజయం సాధించాలంటే ఇవే ముఖ్యం: యువతకు ముఖేష్ అంబానీ 3 సూత్రాలు

ముంబై: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, వ్యాపార రంగంలో లేదా కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించడానికి పెద్ద ఆలోచనలతో పాటు నిరంతర శ్రమ ఎంతో అవసరమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న మూడు ప్రాథమిక విజయ సూత్రాలను ఆయన యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. 1. లక్ష్యంపైనే దృష్టి – అడ్డంకులు దాటే మార్గం "మొదటగా పెద్ద కలలు కనండి. మీ ఆలోచన ఎల్లప్పుడూ తుది లక్ష్యంపైనే స్థిరంగా ఉండాలి" అని అంబానీ పేర్కొన్నారు. ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు, సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని మరువకుండా ముందడుగు...

ముంబై: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, వ్యాపార రంగంలో లేదా కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించడానికి పెద్ద ఆలోచనలతో పాటు నిరంతర శ్రమ ఎంతో అవసరమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న మూడు ప్రాథమిక విజయ సూత్రాలను ఆయన యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. 1. లక్ష్యంపైనే దృష్టి – అడ్డంకులు దాటే మార్గం "మొదటగా పెద్ద కలలు కనండి. మీ ఆలోచన ఎల్లప్పుడూ తుది లక్ష్యంపైనే స్థిరంగా ఉండాలి" అని అంబానీ పేర్కొన్నారు. ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు, సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని మరువకుండా ముందడుగు వేస్తే వాటన్నింటినీ అధిగమించవచ్చని, అలా కాకుండా అడ్డంకుల గురించే ఆలోచిస్తూ కూర్చుంటే అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేమని ఆయన హెచ్చరించారు. 2. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదు విజయానికి ఎలాంటి సులువైన దారులు ఉండవని, కఠిన శ్రమ ఒక్కటే శాశ్వత విజయానికి పునాది అని ఆయన వివరించారు. పోటీ పడేటప్పుడు స్థానికంగా లేదా దేశంలోనే మేటిగా ఉండటమే కాకుండా, ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకొని 'ప్రపంచంలోనే బెస్ట్'గా నిలవడమే అసలైన లక్ష్యం కావాలని సూచించారు. 3. ఆత్మవిశ్వాసమే అసలైన బలం జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎల్లప్పుడూ సానుకూల దృక్పథం (పాజిటివ్ మైండ్‌సెట్) కలిగి ఉండటం అత్యంత కీలకమని అంబానీ తెలిపారు. మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మినప్పుడే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే అనుకున్న అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని ఆయన ఉద్ఘాటించారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

ప్రధాన కేటగిరీలు (Categories)

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు (26)

తెలంగాణ జిల్లాలు (33)