కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి
ముఖ్యమైన పాయింట్స్:108వ డివిజన్లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారంపాల్గొన్న గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర
అనకాపల్లి (ప్రజామద్ర ప్రతినిధి):అనకాపల్లి పట్టణం 108వ వార్డు పరిధిలో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. స్థానిక టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొణతాల సింధుజకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర కూటమి నాయకులతో కలిసి గురువారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మళ్ళా సురేంద్ర మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా చేరవేస్తున్నామని తెలిపారు. పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యం కావాలంటే కూటమి ప్రతినిధులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కార్పొరేటర్ అభ్యర్థి కొణతాల సింధుజను, అలాగే మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణిని అత్యధిక మెజారిటీతో విజయతీరాలకు చేర్చాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రముఖ నాయకులు కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు, కొణతాల జగ్గారావు నాయుడు, కాండ్రేగుల జగ్గారావు, పొలిమేర నాయుడు, పెంటకోట శ్రీనివాసరావుతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు