ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ- ట్రాఫిక్ సీఐ కె. నాగేశ్వరరావు
ముఖ్యమైన పాయింట్స్:ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.✔️ మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దు.✔️ అతివేగం, ట్రిపుల్ రైడింగ్ ప్రాణాంతకం.✔️ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి.✔️ బస్సులు, ఆటోలు ఎక్కేటప్పుడు/దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
అనకాపల్లి:(ప్రజాముద్ర ప్రతినిధి)
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూడిమడక జంక్షన్ వద్ద వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మరియు అనకాపల్లి ఎస్డీపీవోల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ శ్రీ కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. ముఖ్యంగా:
హెల్మెట్ తప్పనిసరి: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
మద్యం తాగి డ్రైవింగ్ వద్దు: మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
ట్రిపుల్ రైడింగ్, అతివేగం నిషేధం: అతివేగం, అజాగ్రత్త మరియు ట్రిపుల్ రైడింగ్ ప్రమాదాలకు ప్రధాన కారణాలని స్పష్టం చేశారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు: మైనర్ బాలబాలికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.
సిగ్నల్ నియమాలు: ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఖచ్చితంగా పాటించాలి.
ప్రయాణికులకు సూచనలు: ఆటోలు, బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం తగదని ప్రయాణికులకు హితవు పలికారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని, మన ప్రాణాలతో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన వారవుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, స్థానిక వాహనదారులు, ప్రయాణికులు పాల్గొన్నారు