🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 October 2026, 11:04 pm Posted by : PRAJAMUDRA

అర్నాబ్ తుఫాన్ తీవ్ర హెచ్చరికలు: అనకాపల్లి జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు

News Image
ముఖ్యమైన పాయింట్స్:అర్నాబ్ తుఫాను అక్టోబర్ 28న బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.ఈ తుఫాను సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.తీరప్రాంత జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.

​బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మరియు విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి. ప్రసాద్ ప్రజలకు, రైతులకు మరియు సిబ్బందికి పలు అత్యవసర ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.
​1. పాఠశాలలు & అంగన్‌వాడీలకు 3 రోజులు సెలవులు
​విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27 నుంచి 29 వరకు (మూడు రోజులు) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు.
​2. విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ & హెల్ప్‌లైన్ నంబర్లు
​అనకాపల్లి జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో 24 గంటల పాటు (3 షిఫ్టులలో) పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటయింది.
​24x7 సర్కిల్ కంట్రోల్ రూమ్: 8712410720 (LMC అనకాపల్లి)
​విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్: 1912
​డివిజన్ల వారీగా వాట్సాప్ ఫిర్యాదు నంబర్లు:
​అనకాపల్లి డివిజన్: 9063110544
​కశింకోట డివిజన్: 8333810597
​నర్సీపట్నం డివిజన్: 9491030714
​3. ముందస్తు రక్షణ చర్యలు & వైద్య ఏర్పాట్లు
​తీరప్రాంతాలు: పరవాడ నుంచి పాయకరావుపేట వరకు ఉన్న 6 తీర మండలాల్లోని మత్స్యకార గ్రామాలు, గిరిజన సబ్ ప్లాన్ గ్రామాలు మరియు వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు అప్రమత్తం చేశారు.
​మత్స్యకారులకు ఆదేశాలు: మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు. బోట్లను తీరానికి దూరంగా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి; తుఫాన్ సమయంలో బోట్లను చూసేందుకు వెళ్లకూడదు.
​గర్భిణీ స్త్రీల సంరక్షణ: రాబోయే వారం రోజుల్లో ప్రసవమయ్యే అవకాశం ఉన్న గర్భిణులను గుర్తించి సమీపంలోని PHC, CHC, ఏరియా లేదా జిల్లా ఆసుపత్రులకు ముందస్తుగానే తరలిస్తున్నారు.
​పునరావాస కేంద్రాలు: కచ్చా ఇళ్లలో ఉన్నవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ కేంద్రాలకు చేరుకోవాలి.
​4. ప్రజలు పాటించాల్సిన కీలక జాగ్రత్తలు
​విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ముందుగానే వాటర్ ట్యాంకులను నింపి ఉంచుకోవాలి.
​వర్షం వల్ల తెగిపడిన విద్యుత్ తీగలు, తడిసిన స్తంభాలు, తీగలపై పడిన కొమ్మలను ముట్టుకోరాదు.
​సురక్షితమైన తాగునీటి కోసం కాచి చల్లార్చిన నీటిని తాగాలి, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
​ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగ్‌ల కింద నిలబడవద్దు.
​5. రైతులకు సూచనలు
​అరటి, కొబ్బరి, తమలపాకు, పోక (అరేకానట్) వంటి పంటలకు చెట్లు పడిపోకుండా తాత్కాలిక ఊతాలు (సపోర్ట్) ఏర్పాటు చేసుకోవాలి.
​కోత దశకు వచ్చిన పంటల హార్వెస్టింగ్‌ను వెంటనే పూర్తి చేయాలి. ఎక్కడైనా నీరు నిలిచిపోతే స్థానిక రైతు సేవా కేంద్రాల (RSK) సిబ్బందిని సంప్రదించాలి.
🏠 Home