🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 3:45 pm Posted by : PRAJAMUDRA

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు

News Image
ముఖ్యమైన పాయింట్స్:అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల సమరం: బరిలో 80 మంది జడ్పీటీసీ, 979 మంది ఎంపీటీసీ అభ్యర్థులుపోలింగ్ నవంబర్ 5న, కౌంటింగ్ 7నరెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంవివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

ప్రజాముద్ర, అనకాపల్లి:
అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం నవంబర్ 7వ తేదీన ఉదయం 8:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.
ఎన్నికల బరిలో అభ్యర్థుల వివరాలు:
జిల్లాలోని మొత్తం 24 జడ్పీటీసీ స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 427 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 425 స్థానాలకు 979 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు.
రెండు స్థానాలు ఏకగ్రీవం:
ఎస్.రాయవరం మండలంలోని పెద్ద గుమ్మలూరు ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏజర్ల అనిల్ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం-1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి లాలం నాగలక్ష్మి ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.
🏠 Home