అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి
ముఖ్యమైన పాయింట్స్:అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండిబీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తికొత్తూరు గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, కరపత్రాల పంపిణీ
అనకాపల్లి:(ప్రజాముద్ర) మండల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి జడ్పీటీసీగా తనకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బలపరిచిన అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు ప్రజలను కోరారు.
మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఈ ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.