110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారం
ముఖ్యమైన పాయింట్స్:110వ వార్డు వైసీపీ అభ్యర్థి జ్యోత్స్న పద్మజకు మద్దతుగా ఉగ్గిన అప్పారావు విస్తృత ప్రచారంఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధిలో ఇంటింటి పర్యటన
(అనకాపల్లి):
జీవీఎంసీ 110వ వార్డు పరిధిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉగ్గిన జ్యోత్స్న పద్మజ విజయానికి మద్దతుగా ఆమె భర్త, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉగ్గిన అప్పారావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం వార్డు పరిధిలోని ఊడ్ పేట నాయిళ్ళ వీధి, కొండపల్లి వారి వీధి తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఉగ్గిన అప్పారావు మాట్లాడుతూ.. ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పంతోనే తన సతీమణి ఎన్నికల బరిలో నిలిచారని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జ్యోత్స్న గెలుపు వార్డు అభివృద్ధికి సరికొత్త మలుపు కానుందని పేర్కొన్నారు. తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
110వ డివిజన్ వైకాపా ఎన్నికల ఇంచార్జ్ శ్రీధరాల మనోజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోన ఉమ, కోటపాడు శివ, ఈతలపాక శివ, జెట్టి శ్రీను, గుండా గుప్తా, కొడుకుల సుబ్రహ్మణ్యం, కోలా గణేష్, చింతా రాంజీ, సతీష్ రెడ్డి, డేనియల్, కోలా సూర్యనారాయణ, మొగలపల్లి సుబ్బారావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.