🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 6:32 pm Posted by : PRAJAMUDRA

కూటమిని గెలిపిస్తేనే వార్డు సమగ్ర అభివృద్ధి: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

News Image
ముఖ్యమైన పాయింట్స్:కూటమిని గెలిపిస్తేనే వార్డు సమగ్ర అభివృద్ధి: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ109వ వార్డులో బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌తో కలిసి ఇంటింటి ప్రచారం
అనకాపల్లి (ప్రజా ముద్ర ప్రతినిధి):
జీవీఎంసీ పరిధిలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారం, వార్డుల సమగ్ర అభివృద్ధి కూటమి కూటమి అభ్యర్థుల విజయంతోనే సాధ్యమని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆయన 109వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
​వార్డు పరిధిలోని విజయరామరాజుపేట వీధులు, పరిసర ప్రాంతాల్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలిశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కూటమి లక్ష్యాలను వివరించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థి బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డులో తాగునీరు, డ్రైనేజీ, రహదారుల వంటి మౌలిక వసతుల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి బలపరిచిన అభ్యర్థికి పూర్తి మద్దతు తెలిపి అఖండ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
​ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్రతో పాటు వార్డుకు చెందిన కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
🏠 Home