మాతృభూమి సేవా సంఘం సేవలు ప్రశంసనీయం
ముఖ్యమైన పాయింట్స్:మాతృభూమి సేవా సంఘం సేవలు ప్రశంసనీయంలోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీడాక్టర్ అపర్ణకు ఘన సత్కారం
అనకాపల్లి , నవంబర్ 6:
ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిస్వార్థంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాతృభూమి సేవా సంఘం సేవలు కొనియాడదగినవని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. శుక్రవారం దేవీపురంలో మాతృభూమి సేవా సంఘం సభ్యుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తున్న మాతృభూమి సేవా సంఘం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు మాట్లాడుతూ.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిరుపేదలకు సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, రానున్న రోజుల్లో ఈ సేవా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు.
డాక్టర్ అపర్ణకు సత్కారం:
ఫిజియోథెరపీ రంగంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పి.హెచ్.ఎన్. అపర్ణను సంఘ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం అనంతగిరి మండలానికి చెందిన సంఘ సభ్యులు ప్రదర్శించిన సాంప్రదాయ థింసా నృత్యం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.
మాతృభూమి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లక రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అపర్ణ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ క్లినిక్ అధినేత పి.సీతారాం, సంఘం అధ్యక్షుడు కనకాచారి, ప్రతినిధులు టి.నాగేశ్వరరావు, పి.ప్రభాకర్, ఈశ్వర ప్రసాద్, కర్రి రాజు, శ్రీనివాసరావు, రమణమూర్తి (గాజువాక), త్రినాథ్ పట్నాయక్, ప్రసాద్ పట్నాయక్, ఆర్.వెంకటేష్, హరి మహేష్, డిముకు నగేష్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.