🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 6:32 pm Posted by : PRAJAMUDRA

డైట్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

News Image
ముఖ్యమైన పాయింట్స్:డైట్‌లో ఘనంగా దీపావళి వేడుకలుదీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ దాడి రత్నాకర్
అనకాపల్లి:
దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (DIET - అటానమస్) కళాశాలలో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కళాశాల ‘లిటరరీ & కల్చరల్ కమిటీ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు రంగోలి (మండల ఆర్ట్స్), ప్రమిదల అలంకరణ (దియా పెయింటింగ్స్) వంటి పలు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతను చాటారు.
ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. వైకుంఠ రావు దీపావళి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా దాడి ఇనిస్టిట్యూట్స్ చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ప్రిన్సిపాల్ డా. ఆర్. వైకుంఠ రావు మాట్లాడుతూ... దీపావళి పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులు పండుగ యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను తెలుసుకోవడంతో పాటు, పర్యావరణహితంగా (గ్రీన్ దీపావళి) జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీన్ (అడ్మినిస్ట్రేషన్) డా. కె. ఈశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home