🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 3:39 pm Posted by : PRAJAMUDRA

సంపతిపురంలో 626 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

News Image
ముఖ్యమైన పాయింట్స్:రీ సర్వేతో భూ యజమానులకు స్పష్టమైన హక్కులు.. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి, నవంబర్ 11: భూ యజమానులకు భూములపై స్పష్టమైన హక్కులు కల్పించడంతో పాటు, భూ వివాదాలకు పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రక్రియలో భాగంగా సంపతిపురం గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో రీ సర్వే పూర్తయిన నేపథ్యంలో మొత్తం 626 ఖాతాలకు సంబంధించి 626 పట్టాదారు పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం ఉదయం అర్హులైన భూ యజమానులకు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూములకు సంబంధించిన రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటు, భూ యజమానులకు తమ ఆస్తులపై స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం రీ సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు.

రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో అర్హులైన భూ యజమానులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో భూములకు సంబంధించిన సమస్యలు, వివాదాలు తగ్గేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ జి. ఆనందరావు తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
🏠 Home