అగ్నిప్రమాద బాధిత నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
ముఖ్యమైన పాయింట్స్:కొండకొప్పాకలో రెండు ఇళ్లు దగ్ధం.. బాధితులకు సీపీఎం బృందం నిత్యావసర సరుకులు, వంట సామగ్రి పంపిణీ
అనకాపల్లి, నవంబర్ 11: అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
అనకాపల్లి మండలం కొండకొప్పాక ఎస్సీ కాలనీలో మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో మామిడి నరసమ్మ, కొలుసు అప్పారావుకు చెందిన రెండు రేకుల ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రెండు కుటుంబాలు ఇళ్లతో పాటు ఇంట్లోని సామగ్రిని కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయాయి.
ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నాయకుల బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించింది. వారికి తక్షణ ఉపశమనం కల్పించే ఉద్దేశంతో బియ్యం, నిత్యావసర సరుకులు, స్టీల్ వంట పాత్రలు, దుప్పట్లు, తువ్వాళ్లు, దుస్తులను పంపిణీ చేసింది.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శంకర్రావు మాట్లాడుతూ.. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన రెండు కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, వారు తిరిగి గౌరవప్రదమైన జీవనం సాగించేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శంకర్రావు, జిల్లా కమిటీ సభ్యులు వి.వి. శ్రీనివాసరావు, బొప్పే ఉమామహేశ్వరరావు, సీనియర్ నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ, కె. ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Nagireddy Sivaji (ప్రజాముద్ర ప్రతినిధి)