🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 11:53 am Posted by : PRAJAMUDRA

అంతర్జాతీయ వేదికపై ఏటికొప్పాక కళాకృతులకు విశేష గుర్తింపు

News Image
ముఖ్యమైన పాయింట్స్:CII భాగస్వామ్య సదస్సులో ఏటికొప్పాక స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం
అనకాపల్లి, నవంబర్ 13: ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ CII భాగస్వామ్య సదస్సు–2026లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక కళాకృతుల ప్రదర్శన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర ప్రముఖులు ఈ స్టాల్‌ను సందర్శించారు.

అలాగే CII డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా కూడా ఏటికొప్పాక కళాకృతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏటికొప్పాకకు చెందిన సంప్రదాయ బొమ్మలు, హస్తకళా ఉత్పత్తుల ప్రత్యేకతలను స్టాల్ నిర్వాహకులు ప్రముఖులకు వివరించారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపం తయారీ విధానం, దాని వెనుక ఉన్న సంప్రదాయం, ప్రత్యేకతలను తెలియజేశారు.

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో ఏటికొప్పాక కళాకృతులకు ప్రదర్శన అవకాశం లభించడం స్థానిక హస్తకళాకారులకు ప్రోత్సాహకరంగా నిలుస్తోంది. ఇలాంటి వేదికల ద్వారా ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలకు దేశవిదేశాల్లో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.

– ప్రజా ముద్ర NEWS
🏠 Home