🏠 prajamudra.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 10:45 pm Posted by : PRAJAMUDRA

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ముఖ్య సమాచారం.. ఖర్చు పరిమితులు, డిపాజిట్ వివరాలు ఇవే!

News Image

అనకాపల్లి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల వ్యయ పరిమితులు, నామినేషన్ సమయంలో చెల్లించాల్సిన ధరావతు మొత్తాల వివరాలు వెల్లడయ్యాయి.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2026 అక్టోబర్ 10న నోటిఫికేషన్ నంబర్లు 566/SEC-B1/2026, 567/SEC-B1/2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి:

- 10 వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.2.50 లక్షలు.
- 10 వేల లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.4 లక్షలు.

వార్డు సభ్యుల ఎన్నికల వ్యయ పరిమితి:

- 10 వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.60 వేలు.
- 10 వేల లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.1 లక్ష.

నామినేషన్ ధరావతు (డిపాజిట్) వివరాలు:

అభ్యర్థి కేటగిరీ| జనరల్| ఎస్సీ, ఎస్టీ, బీసీ
వార్డు సభ్యుడు| రూ.1,000| రూ.500
సర్పంచ్| రూ.3,000| రూ.1,500

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో తమకు వర్తించే ధరావతు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన వ్యయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలి.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియకు ముందుగానే ఈ వివరాలను తెలుసుకుని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.

ప్రజా ముద్ర NEWS
🏠 Home