కార్తీక మాసంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి
ముఖ్యమైన పాయింట్స్:పుణ్యస్నానాల సమయంలో జాగ్రత్తలు పాటించాలి.. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా సూచనలు
అనకాపల్లి, నవంబర్ 15: కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు, ఆలయాలు, నదీ తీరాలు, సముద్ర తీర ప్రాంతాలకు భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. పుణ్యస్నానాలు, ఆలయ దర్శనాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల చోటుచేసుకున్న నీటిలో మునిగి మృతి చెందిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎస్పీ పేర్కొన్నారు. భక్తుల భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు, ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.
లోతైన ప్రాంతాల్లో స్నానాలు వద్దు
నదులు, చెరువులు, సముద్ర తీరాల్లో స్నానాలు చేసేటప్పుడు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను గమనిస్తూ సురక్షిత ప్రాంతాల్లోనే స్నానాలు చేయాలని తెలిపారు.
చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
ఆలయ ప్రాంగణాలు, స్నాన ఘట్టాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు చిన్నారులను నిరంతరం కనిపెట్టుకుని ఉండాలని సూచించారు.
పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి
భద్రతా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు, వాలంటీర్లు ఇచ్చే సూచనలను భక్తులు తప్పనిసరిగా అనుసరించాలని ఎస్పీ కోరారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 112 లేదా 100కు సమాచారం అందించాలని తెలిపారు.
పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు
కార్తీక మాస రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. తీర ప్రాంతాలు, నదీ తీరాలు, స్నాన ఘట్టాల వద్ద నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, వాలంటీర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజా ముద్ర NEWS